కళ్లకు గంతలు కట్టి 25 సెకన్లలో గణపతి పెయింటింగ్..

బనారస్‌లోని విశ్వనాథ్ నగరంలో గణపయ్యకు ప్రత్యేకమైన భక్తులు ఉన్నారు.

Update: 2024-09-06 08:16 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : బనారస్‌లోని విశ్వనాథ్ నగరంలో గణపయ్యకు ప్రత్యేకమైన భక్తులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఓ భక్తుడు కేవలం 25 సెకన్లలో కళ్ళు మూసుకుని ఏకదంతుని చిత్రపటాన్ని గీస్తారు. ఇంతకీ ఆయన ఎవరు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వారణాసిలోని అస్సీ ప్రాంతానికి చెందిన విజయ్ చిన్నప్పటి నుంచి గణపతి భక్తుడు. ఆయన భక్తిలో మునిగిపోయిన విజయ్ తన కళ్లకు గంతలు కట్టుకుని పెయింటింగ్‌ను కాన్వాస్‌ పై గీస్తాడు. పెయింటింగ్ చేయడానికి ముందు, అతను గణపతిని ధ్యానం చేసుకుంటాడు. ఆపై ఓం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ, అతను బప్పా పెయింటింగ్‌ను గీస్తాడు.

25 సెకన్లలో పెయింటింగ్‌..

విజయ్ గీసిన అద్భుతమైన కళాకృతిని చూసిన వారు ఆశ్చర్యానికి గురికాక తప్పరు. ఇంతకుముందు తాను గణపయ్య పెయింటింగ్‌ను కళ్లు తెరచుకుని వేసేవాడని, అయితే అతని మేనల్లుడు కొన్నేళ్ల క్రితం తన కళ్లకు గంతలు కట్టి ఆపై గణపతి పెయింటింగ్ వేయమని అడిగాడని చెబుతున్నారు. ఆ తర్వాత విజయ్ దానిని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు కళ్లు మూసుకునే 25 నుంచి 30 సెకన్లలో పెయింటింగ్ వేస్తున్నాడని చెబుతున్నాడు.

2 రికార్డులు..

గణపతి బప్పా ఆశీస్సులతో ఇప్పటి వరకు విజయ్ తన పేరిట 2 ప్రపంచ రికార్డులు సాధించాడు. లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు, అతను మరో ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రపంచ రికార్డు సృష్టించే పనిలో బిజీగా ఉన్నానని విజయ్ చెబుతున్నాడు.


Similar News