Banana: 30 రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. ఆ సమస్యలన్నీ పరార్!

30 రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి

Update: 2024-09-16 06:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది అరటిపండును ఇష్టంగా తింటారు. దీనిని తీసుకోవడం వలన పొట్ట, శరీరానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజూ అరటిపండును తినాలని చెబుతున్నారు. దీనివల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బనానా లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన చర్మానికి చాలా మంచిది. ఇక 30 రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ పండును తినడం వలన మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం..

1. బనానా లో సోడియం, ఐరన్, విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, కేలరీలు ఉంటాయి. దీనిలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2. అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజుకి రెండు అరటిపండ్లు తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా, మలబద్ధకం కూడా తగ్గుముఖం పడుతుంది.

3. రోజుకొక అరటి పండు తినడం వలన బీపీ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా, కీడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అరటిపండులో ఉండే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News