సింహరాశిలో పౌర్ణమి.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
మాఘ మాసంలో, మాఘ పూర్ణిమ వస్తుంది.
దిశ, ఫీచర్స్: మాఘ మాసంలో, మాఘ పూర్ణిమ వస్తుంది. కర్కాటక, సింహ రాశి వారికి మాఘ పూర్ణిమ నాడు విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే మాఘ పూర్ణిమ నాడు చంద్రుడు కర్కాటక రాశిలో 07:25 వరకు ఉండి, అదే రోజున సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఆ రెండు రాశుల వారు దీని వల్ల ప్రయోజనం పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కర్కాటకం మరియు సింహరాశి వారిపై ప్రభావం
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మాఘ పూర్ణిమ మంచి రోజులు తీసుకురానుంది. మీ కుటుంబానికి ఆనందం వస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు దీని వల్ల లాభపడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి
మాఘ పౌర్ణమి పెద్ద మెుత్తంలో డబ్బును తెస్తుంది. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారుతుంది. మీరు మీ కుటుంబానికి మద్దతు ఇస్తారు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబం నుండి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. ఈ సమయంలో పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.