నవజాత శిశువుకు నీరు ఎప్పటి నుంచి ఇవ్వాలి?
నవజాత శిశువును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
దిశ, ఫీచర్స్: నవజాత శిశువును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పసి పిల్లలు ఎక్కువగా నిద్ర పోతుంటారు. వారు నిద్ర నుంచి మేల్కొనగానే తల్లి పాలిచ్చి మరలా నిద్ర పోయేవరకు శ్రద్ధ తీసుకోవడం అవసరం. ప్రతి రెండు గంటలకొకసారి మీ నవజాత శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని సిఫార్సు చేయబడింది. పిల్లలకు పెట్టే ఆహారంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. కొంత మంది పిల్లలకు నీటిని తాగిస్తారు.. కానీ, ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువుకి ఎన్ని రోజుల తర్వాత నీటిని ఇవ్వాలో ఇక్కడ చూద్దాం.. కొంత తెలుసుకుందాం..
వైద్యులు చెప్పిన దాని ప్రకారం, పసి పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలని మాత్రమే ఇవ్వాలి. పాలు పడని స్త్రీలకు వారి వైద్యుడు సూచించిన ఫార్ములా మేరకు పాలు ఇవ్వవచ్చు. ఇలా చేయడం వలన వారి ఆకలి తీరి, ఆరోగ్యంగా ఉంటారు.
బిడ్డ పుట్టిన 6 నెలల వరకు ఆహారాలేవి తినిపించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తల్లి పాలలోనే నీరు ఉంటుంది. తల్లిపాలు ఇచ్చిన తర్వాత నీరు ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి పుట్టిన ఆరు నెలల తర్వాత నుంచి పిల్లలకు నీరు, ఆహారం ఇవ్వొచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ఇలా క్రమంగా వారికి ఇతర ఆహారాలకు పరిచయం చేయాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.