వారి కోసం మొదటిసారిగా ‘మాంసాహార అన్నం’ ఉత్పత్తి.. దీన్ని తింటే చికెన్ తింటున్నట్లు ఉంటుంది..
ప్రపంచంలో ఎక్కువ జనాభాకు ఆహార అవసరాలు తీరుస్తోంది బియ్యం (రైస్).
దిశ,ఫీచర్స్ : ప్రపంచంలో ఎక్కువ జనాభాకు ఆహార అవసరాలు తీరుస్తోంది బియ్యం (రైస్). ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బియ్యం వినియోగమే కనిపిస్తుంది. అది కూడా బ్రౌన్ రైస్ , బ్లాక్ రైస్ (ఫర్ బిడెన్), రెడ్ రైస్, వైల్డ్ రైస్.. ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆహార ప్రియులకు గుడ్ న్యూస్. తాజాగా చికెన్ రుచితో ఉండే బియ్యాన్ని ఉత్పత్తి చేశారు శాస్త్రవేత్తలు. మాంసం రుచి ఎలా ఉంటుందో... అలాంటి రుచిని ఇచ్చే అన్నాన్ని కనిపెట్టారు. దీనికి ‘మీటీ రైస్’ అని పేరు పెట్టారు. మనం తెలుగులో మాంసాహార అన్నం అని పిలుచుకోవచ్చు. అయితే దీన్ని దక్షిణ కొరియాలోని యోన్సే యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు తయారు చేశారు. మరి దీని ఎలా తయారు చేశారు. దీని వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ..
పరిశోధకులు ఈ బియ్యాన్ని వివిధ రకాల మాంసం, చేపల రుచిని పరిగణనలోకి తీసుకొని ప్రయోగశాలలో ఈ బియ్యాన్ని తయారు చేశారు. సాధారణ మాంసం తో పోలిస్తే ఈ బియ్యం ఎనిమిది శాతం ఎక్కువ ప్రోటీన్, ఏడు శాతం ఎక్కువ మంచి కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు. కండరాలు అభివృద్ధికి కావలసిన పోషకాలు ఇది అందిస్తుంది.
మరి ఎందుకు ‘మీటీ రైస్’ ను సృష్టించారంటే..
మాంసాహార అన్నాన్ని శాస్త్రవేత్తలు ఎందుకు సృష్టించారు అనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే దీన్ని సైనికుల కోసం తయారు చేశారు. వారి అవసరాలను తీర్చేందుకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వారికి పోషకాహార లోపం రాకుండా ఈ బియ్యాన్ని అందిస్తారు. ఈ బియ్యంతో వండిన అన్నం 11 రోజుల పాటు తాజాగా ఉంటుంది. కాబట్టి సైనికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి శక్తి కూడా నిరంతరం అందుతూనే ఉంటుంది.
అంతేకాదు పర్యావరణానికి అనుగుణంగా ఈ మీటీ రైస్ ఎంతో మేలు చేస్తుంది. మాంసం ఉత్పత్తిలో కార్బన్ డయాక్సైడ్ విడుదల ఎక్కువగా ఉంటుంది. జంతు పెంపకం తో పోలిస్తే ఈ బియ్యాన్ని పండించడమే సులువు . కాగా ఈ బియ్యాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు మరింత పరిశోధన అవసరం. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.