FIFA Fantasy .. 'Football Unites the World' అంటూ క్యాంపెయిన్

ఖతార్ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు FIFA.. 'ఫుట్‌బాల్ యునైట్స్ ది వరల్డ్' అనే సోషల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది..

Update: 2022-12-10 05:42 GMT

దిశ, ఫీచర్స్: ఖతార్ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు FIFA.. 'ఫుట్‌బాల్ యునైట్స్ ది వరల్డ్' అనే సోషల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రపంచం వైరుధ్యాలు, సంక్షోభాలతో విభజించబడిందని.. కానీ ఈ ప్రపంచ కప్ సరిహద్దులు దాటడానికి, సంబరాలు చేసుకోవడానికి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తుందని వాగ్దానం చేసింది. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC).. ఒలింపిక్ గేమ్స్ ప్రపంచ దేశాలను ఏకీకృతం చేస్తాయని ప్రచారం చేసింది. ఇలాంటి ఆకాంక్షలు కేవలం ఆటలు ఆడేందుకు దేశాలను అన్నింటిని ఒకచోటికి చేర్చడం మాత్రమే కాదు.. అంతర్జాతీయ సంబంధాలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఈ రెండు ప్రపంచ సంస్థలు విశ్వసిస్తున్నాయి. కానీ ఇది ఎంత వరకు నిజం? ఈ ఏడాది ఎలాంటి రాజకీయ నిరసనలు జరిగాయి? ఆతిథ్య దేశం ఇతర దేశాల అతిథులను ఎన్ని ఇబ్బందులు పెట్టింది? ఫిఫా ఎవరికి ఎలా సపోర్ట్ చేసింది? ముందు ప్రకటించిన నినాదానికి కట్టుబడి ఉందా?

నిజానికి బాలిలో ఇటీవల జరిగిన G20 సమ్మిట్‌లో FIFA, IOC అధ్యక్షులిద్దరూ స్పీకర్స్‌గా ఆహ్వానించబడ్డారు. FIFA సుప్రీమో, Gianni Infantino, ఖతార్‌లో పురుషుల ప్రపంచ కప్ జరిగేంత వరకు ఉక్రెయిన్‌పై రష్యా కాల్పుల విరమణ కోసం కల్పిత ఒలింపిక్ సంధిని అనుసరించారు. కానీ దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే FIFA 2022 ప్రపంచ కప్ సమయంలో ఐక్యత, శాంతిగా ఉండాలని ప్రకటించినప్పటికీ.. టోర్నమెంట్‌లో రాజకీయ సంఘర్షణ, నిరసనకు సంబంధించిన శక్తివంతమైన ఉదాహరణలు ఉన్నాయి.

FIFA ప్రపంచ కప్ - రాజకీయ నిరసన

ఫుట్‌బాల్ 'ప్రపంచాన్ని ఏకం చేస్తోంది' అని భావించిన సమయంలో.. కొంత మంది పార్టిసిపెంట్స్, కామెంటేటర్స్ నుంచి అవాంఛనీయమైన విమర్శలను అరికట్టడానికి FIFA పెనుగులాడుతోంది. ఈ అసమ్మతి ప్రధానంగా ప్రపంచ కప్ హోస్ట్‌ ఖతార్.. విదేశీ కార్మికుల దోపిడీ, LGBTQI+ కమ్యూనిటీల పట్ల వివక్ష, మద్యం సేవించడంపై ఉన్న పరిమితుల కారణంగా వచ్చింది. దీంతో FIFA సుప్రీమో ఇన్ఫాంటినో ఫుట్‌బాల్ సమాఖ్యలకు ఒక లేఖ పంపాడు. 'దయచేసి, ఇప్పుడు ఫుట్‌బాల్‌పై దృష్టి పెడదాం!' ఐడియలాజికల్, పొలిటికల్ వార్‌లోకి ఫుట్‌బాల్‌ను లాగడానికి అనుమతించవద్దని కోరాడు. అయితే, ఫుట్‌బాల్ టీమ్స్ గెలుపొందడంపై దృష్టిపెట్టినా.. కొందరు ఆధునిక క్రీడలో చేర్పులు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం వంటి ప్రాథమిక విలువలను కూడా ప్రోత్సహించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య సంస్కృతులకు చెందిన అనేక ఫుట్ బాల్ జట్లు.. క్రీడ, సమాజంలో ఐక్యత అంటే ఏమిటో ప్రగతిశీల దృష్టిని కలిగి ఉంటాయి కాబట్టి నిరసనలు తప్పలేదు.

రెయిన్‌బో వివాదం :

FIFA 2017 హ్యూమర్ రైట్స్ పాలసీ.. ఫుట్ బాల్ ప్రపంచం పిచ్‌ లోపల, వెలుపల వివక్షను నిషేధిస్తుంది. ఇతర లక్షణాలతో పాటు లైంగిక ధోరణికి సంబంధించిన స్వేచ్ఛ ప్రత్యేకంగా రక్షించబడుతుంది. దీనికి అనుగుణంగా ఏడు యూరోపియన్ దేశాలు 2022 ప్రపంచ కప్‌లో సెక్స్ అండ్ జెండర్ డైవర్స్ కమ్యూనిటీలకు తమ మద్దతును ప్రదర్శించాలని భావిస్తున్నట్లు FIFAకి తెలియజేశాయి. ఈ క్రమంలో UEFA యూరో 2020 ఛాంపియన్‌షిప్‌లో డచ్‌లు చేసిన విధంగానే ఈ దేశాల టీమ్ కెప్టెన్‌లు.. 'OneLove' రెయిన్‌బో-కలర్ ఆర్మ్‌బ్యాండ్‌ను ధరించాలి. కానీ ప్రారంభ ఆటకు కొన్ని గంటల ముందు.. FIFA OneLove సింబల్స్ తమ నియమాల ఉల్లంఘనగా ప్రకటించింది. ఏ కిట్‌లోనూ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగత నినాదాలు, ప్రకటనలు లేదా చిత్రాలు ఉండకూడదని తెలిపింది. ఆర్మ్‌బ్యాండ్ ధరించడం వల్ల కేవలం జరిమానా మాత్రమే కాదు ఎల్లో కార్డ్‌ల రూపంలో మైదానంలో శిక్ష విధించబడుతుందని హెచ్చరించింది.

ఈ నిర్ణయంతో కోపంగా ఉన్న యూరోపియన్ జట్లు చేసేదేమీ లేక వెనక్కి తగ్గినప్పటికీ.. జర్మన్ జట్టు మాత్రం తమ తదుపరి మ్యాచ్ ప్రారంభానికి ముందు లాంఛనప్రాయ నిరసన చేసింది. FIFA తమ హక్కును కాలరాయడాన్ని ఖండిస్తూ నోరు కవర్ చేసుకుని ప్రొటెస్ట్ చేశారు. జర్మనీ ఇంటీరియర్ మినిస్టర్, నాన్సీ ఫేజర్, ఆ గేమ్‌లో ఇన్‌ఫాంటినో పక్కనే ఉన్న సమయంలో 'OneLove' ఆర్మ్‌బ్యాండ్‌ను ధరించారు.

విలువల ఘర్షణ :

FIFA అదే సమయంలో దాని సొంత పరిష్కారాన్ని అందించింది. క్వార్టర్ ఫైనల్ స్టేజ్ నుంచి 'నో డిస్‌క్రిమినేషన్' క్యాంపెయిన్‌తో ముందుకొచ్చింది. FIFA-ఆమోదించిన ఆర్మ్‌బ్యాండ్‌లు వివక్షకు వ్యతిరేకంగా సమ్మతించినా.. లింగం, లింగ వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. దీంతో FIFA బలహీనమైన పబ్లిక్ రిలేషన్స్ డబుల్‌స్పీక్‌గా మారడం, కన్‌ఫ్యూజన్ క్రియేట్ కావడం జరిగింది. OneLove ఆర్మ్‌బ్యాండ్‌లను ముందుగా నిషేధించినప్పటికీ.. OneLove, LGBTQI+ కమ్యూనిటీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించడంపై విమర్శలు ఎదుర్కొంది.

స్వలింగ సంపర్కం ఇస్లాంకు అవమానకరమైనది. చట్టం ప్రకారం నిషిద్ధమైన ఆ సందేశం ఖతారీ అధికారులతో దాదాపు ప్రతిధ్వనించదు. టోర్నమెంట్‌కు ముందు, ఖతార్ ప్రపంచ కప్ అంబాసిడర్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఖలీద్ సల్మాన్, ఒక జర్మన్ బ్రాడ్‌కాస్టర్‌తో స్వలింగ ఆకర్షణ మనసుకు నష్టమని పేర్కొన్నాడు. రెండు వారాల తర్వాత ఖతార్‌లోని అల్కాస్ స్పోర్ట్స్ ఛానెల్‌లోని ప్యానెలిస్ట్‌లు.. అక్కడ నిరసన తెలిపిన జర్మన్ ఫుట్ బాల్ జట్టు కప్ నుంచి నిష్క్రమించడాన్ని ఆస్వాదించడంతో పాటు వారి నిరసన సంజ్ఞను ఎగతాళి చేశారు.

ఖతార్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చే ముందే FIFAకు ఈ విలువల ఘర్షణ గురించి బాగా తెలుసు. ఇందుకోసం స్థానిక నిబంధనలను వాయిదా వేసింది. కానీ అది వర్కవుట్ కాక విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఖతార్ LGBTQI+ కమ్యూనిటీలకు అభిమానులు తమ దుస్తుల ద్వారా సింబాలిక్ మద్దతును తెలియజేయకుండా నిరోధించింది. స్టేడియాల ప్రవేశం వద్ద, రెయిన్‌బో అలంకారాలు ఉన్న దుస్తులను ధరించిన వ్యక్తులకు ఖతార్ సెక్యూరిటీ మొదట్లో ప్రవేశాన్ని నిరాకరించింది. అయితే, FIFAతో అత్యవసర చర్చల తర్వాత ఓకే చెప్పింది. ఈ కోణంలో ఆటగాళ్ల కంటే అభిమానులకు ఎక్కువ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.

కానీ కొంతమంది ఇంగ్లండ్ అభిమానులు ప్రారంభ మ్యాచ్‌కు తమ దేశ పోషకుడిలా దుస్తులు ధరించి.. ఫాక్స్ హెల్మెట్‌లు, ప్లాస్టిక్ కత్తులు, సెయింట్ జార్జ్ క్రాస్ ఉన్న షీల్డ్‌లతో వచ్చినప్పుడు ఖతార్ పోలీసులు వారి ప్రవేశాన్ని నిరాకరించారు. ఈ వస్త్రధారణకు ఆంగ్ల క్రీడాభిమానుల మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. కానీ ఈ సమయంలో FIFA ఖతార్ పక్షాన నిలిచింది. క్రూసేడర్ దుస్తులు ముస్లింలకు చారిత్రాత్మకంగా అభ్యంతరకరంగా ఉండవచ్చని నిర్ణయించింది.

నేషన్స్ యూనిటీ??

ఇరాన్‌లో నిరసన ఉద్యమానికి మద్దతుగా.. ఇస్లామిక్ రిపబ్లిక్, మొరాలిటీ పోలీసులకు వ్యతిరేకంగా తెలిపిన నిరసనలో టీ-షర్టులు ధరించడం లేదా ప్లకార్డులు పట్టుకోవడం నేరమని ఇరాన్ ప్రేక్షకులు అడ్డుకోబడ్డారు. పర్షియన్ ప్రీ-రెవల్యూషన్ జెండాలు, 'స్త్రీ, జీవితం, స్వేచ్ఛ' అనే పదాలతో ఉన్న వస్తువులను భద్రతా దళాలు, ప్రభుత్వ అనుకూల ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసమ్మతి చిహ్నాలు ఇకపై ప్రపంచ కప్ అధికారులచే నిరోధించబడవని ఇరానియన్‌లకు భరోసా ఇవ్వడానికి FIFA చివరికి జోక్యం చేసుకుంది. అయితే ఇరాన్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత మాత్రమే ఇది జరిగింది.

Tags:    

Similar News