Health Tips : ప్యాంక్రియాస్ వ్యాధితో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది..
ప్యాంక్రియాస్ మన జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : ప్యాంక్రియాస్ మన జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ చాలా మంది ప్యాంక్రియాస్ సమస్యలతో బాధపడుతుంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ప్యాంక్రియాస్ సమస్య మొత్తం జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే ఇందులో ఏదైనా సమస్య ఉంటే మందులతో పాటు ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు ప్యాంక్రియాస్ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కాబట్టి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యనిపుణులు. మరి ప్యాంక్రియాస్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం..
ప్యాంక్రియాస్ సమస్యతో బాధపడేవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటైటిస్ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది ప్యాంక్రియాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
రెడ్ మీట్..
రెడ్ మీట్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడం కష్టం కాబట్టి ప్యాంక్రియాస్‌కు హానికరంగా మారుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి దాని వినియోగాన్ని నివారించడం మంచిదంటున్నారు వైద్యనిపుణులు.
కార్బోహైడ్రేట్లు..
ప్యాంక్రియాటిక్ రోగులు వైట్ బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు, వైట్ రైస్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లకు దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు షుగర్ ను వేగంగా పెంచుతాయి. ఇది ప్యాంక్రియాస్ పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
ఫ్రై చేసిన ఆహారం..
ఫ్రై చేసిన ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్యాంక్రియాస్ ను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే మీరు దానికి దూరంగా ఉండాలి. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫ్రైస్ కూడా ప్యాంక్రియాస్ ఆరోగ్యానికి హానికరం.
పాల ఉత్పత్తులు..
పాల ఉత్పత్తులలో ఉండే కొవ్వు, లాక్టోస్ ప్యాంక్రియాస్ సమస్యలను పెంచుతుంది. కాబట్టి అటువంటి రోగులు పాలు, క్రీమ్, చీజ్, వెన్న తక్కువగా తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.