వర్షాకాలంలో ఇంట్లోకి పురుగులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

చూస్తుండగానే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసింది. గత కొద్ది కాలంగా ఉదయం బాగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా వర్షం పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది.

Update: 2024-06-26 14:14 GMT

దిశ, ఫీచర్స్: చూస్తుండగానే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసింది. గత కొద్ది కాలంగా ఉదయం బాగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా వర్షం పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే వర్షాలు పడటంతో ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లు తడుస్తూ పోతున్నారు. అయితే వర్షాకాలం పలు రకాల కీటకాలు ఇంట్లోకి వస్తే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా వానాకాలం ఉషిల్లు బాగా ఇంట్లోకి వచ్చి తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. కిటికీలు, తలుపులు మూసి ఉన్నప్పటికీ అవి ఇంట్లో చేరి నానా తంటాలు పడేలా చేస్తుంటాయి. అయితే ఉషిల్లు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే అవి రాకుండా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

*ఈ పురుగులను తరిమికొట్టడానికి, నిమ్మకాయ, బేకింగ్ సోడా లిక్విడ్‌ను కలిపి ఓ బాటిల్‌లో పోసి స్ప్రే చేస్తు వెంటనే పురుగులు పారిపోతాయి.

* అలాగే నల్ల మిరియాలు ఘాటుగా ఉంటాయి. దీంతో అంత ఘాటు తట్టుకోలేక పురుగులు పోతాయి. కాబట్టి మిరియాలను పొడిగా చేసి నీటిలో పోటి పురుగులు ఉన్నచోట కొడితే రాకుండా ఉంటాయి.

*పురుగులను తరిమికొట్టడంలో వేప నూనె సహాయపడుతుంది. వేప నూనెను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చల్లితే ఇంట్లోకి పురుగులు రావు.

* ఇక లైట్స్‌ ఉన్న చోట ఆయిల్‌ రాసి న్యూస్‌ పేపర్స్‌ను ఏర్పాటు చేసినా పురుగులు వాటికి అతుక్కుపోతాయి. పని ఈజీగా అయిపోతుంది. కాబట్టి పురుగులకు చెక్ పెట్టవచ్చు.

Similar News