రాత్రి సమయంలో ఇలా చేస్తే బానపొట్ట సైతం స్లిమ్‌గా మారాల్సిందే..!

ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా ఎక్కువగా బాధపడేది ఊబకాయం వస్తుందని.

Update: 2023-06-23 12:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా ఎక్కువగా బాధపడేది ఊబకాయం వస్తుందని. ఒకప్పటి జీవన విధానానికి, ఇప్పటి దానికి చాలా మార్పులు వచ్చాయి. అలాగే తినే ఆహారంలో కూడా వైరుధ్యం ఏర్పడింది. దీంతో చాలా మంది చిన్న వయసు నుంచే ఊబకాయం బారినపడుతున్నారు. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం లేదా శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడంతో ఈ సమస్యను ఎక్కువగా ఎదర్కోవలసి వస్తుంది. ఒకవేళ వ్యాయామం చేద్దామనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌ కారణంగా సాధ్యపడటం లేదు. దీంతో ఊబకాయం మాత్రమే కాదు కొత్త కొత్త వ్యాధులని కొనితెచ్చుకునే పరిస్థితి ఏర్పుడుతుంది. మరి ఇలాంటి సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం.

అధికబరువుతో, ఊబకాయం సమస్యతో బాధపడేవారు ముందుగా మంచి డైట్ ఫాలో అవ్వాలి. దానికోసం కొన్ని ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. అవి ఏంటంటే పాలు, పాల ఉత్పత్తులు, చక్కెర, చక్కెర ఉత్పత్తులు, తెల్ల బియ్యం, తెల్ల పిండితో చేసిన పదార్థాలు, ఉప్పు తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రిపూట మాత్రం వీటిని అస్సలు తీసుకోకూడదు. ఈ ఐదు పదార్థాలను మానేస్తే చాలు ఒక వారంలోనే ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు చాలా మంది రాత్రి వేళ్లలో పడుకోవడానికి గంట ముందో, రెండు గంటల ముందో ఆహారం తీసుకుంటారు. అలా కాకుండా కనీసం నాలుగు గంటల ముందే ఆహారం తీసుకోండి. అలాగే అధికంగా మాంసాహారం తినడం, ఆల్కహాల్‌ తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటే కాస్త కంట్రోల్ చేసుకోండి. ఈ విధంగా డైట్‌ ఫాలో అయితే నెల రోజుల్లోనే బరువు తగ్గడం గమనిస్తారు.

Read More...   పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు ఎలా వస్తాయి..? 

Tags:    

Similar News