చర్మం దురదగా ఉందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

శీతాకాలంలో చాలామందికి చర్మం పొడిబారుతుంది.

Update: 2024-11-17 07:58 GMT

దిశ, ఫీచర్స్: శీతాకాలంలో చాలామందికి చర్మం పొడిబారుతుంది. ఈ పొడిబారిన చర్మం కారణంగా స్కిన్‌పై మంట, దురద ఎక్కువగా ఉంటుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే స్కిన్ అలర్జీ ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు ఈ దురద కారణంగా ముఖం, శరీరంపై మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిని తగ్గించుకోవడం కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. దురదలు, మంటను తగ్గించవచ్చు.

ఐస్ మసాజ్: చర్మం మరీ ఎక్కువగా దురద లేదా మంటగా ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్ మేలు చేస్తాయి. ఒక క్లాత్‌లో కొన్ని ఐస్‌క్యూబ్స్ వేసుకొని, కోల్డ్ కంప్రెస్ చేయండి. ఐదు నిమిషాల పాటు అలానే ఉంచితే, దురద తగ్గుతుంది.

వేప నూనె: వేప నూనె చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మం అలెర్జీలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ నూనెను దురద ఉన్న ప్రదేశంలో రాసి, 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తరువాత వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల దురద, మంట, దద్దుర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది సీజనల్ వ్యాధులను దరిచేరనివ్వదు.

టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల చర్మంపై ఉన్న దురద, మంట తగ్గుతుంది. ఇది చర్మానికి మాశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకొని, దురద ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. అంతేకాకుండా.. విటమిన్- ఇ ఎక్కువగా ఉండే ఆలివ్ ఆయిల్ కూడా చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అలోవెరా: అలోవెరాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ అలర్జీలను దూరం చేస్తాయి. దురద ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసి, 15 నిమిషాల తరువాత క్లీన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఇది చర్మాన్ని మాశ్చరైజింగ్ చేసి, మృదువుగా మారుస్తుంది.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె చర్మానికి పోషణ అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దురద ఉన్న ప్రాంతంలో కొబ్బరి నూనెను సున్నితంగా అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

బట్టలు: చర్మానికి చిరాకు కలిగించే బట్టలు వేసుకోకుండా ఉంటే మంచిది. సిల్క్, టైట్ దుస్తులు కాకుండా.. కాటన్, ఫ్యాబ్రిక్స్‌లో ఉండే లూజ్ బట్టలను వేసుకోవడం మంచిది.


Read More..

 Acne: మొటిమలను గోళ్లతో గిల్లుతున్నారా? మచ్చలకే కాదు.. మరిన్ని సమస్యలకు దారితీస్తుంది..!

Tags:    

Similar News