సరసాలతో ఒంటరితనం దూరం.. ఇద్దరికీ స్పెషల్‌గానే ఉంటుందట..

హేయ్ ఈ డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నావు.. నీ లుక్‌తో మతిపోగొడుతున్నావ్.. రోజురోజుకు అందం ఎక్కువైపోతుంది.. లాంటి పాజిటివ్ కామెంట్స్ ఫ్లర్టింగ్ కిందకు వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సరసాలు అంగీకరించదగినవిగా

Update: 2023-06-23 11:17 GMT

దిశ, ఫీచర్స్: హేయ్ ఈ డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నావు.. నీ లుక్‌తో మతిపోగొడుతున్నావ్.. రోజురోజుకు అందం ఎక్కువైపోతుంది.. లాంటి పాజిటివ్ కామెంట్స్ ఫ్లర్టింగ్ కిందకు వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సరసాలు అంగీకరించదగినవిగా ఉన్నప్పుడు.. కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న పర్సన్ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒంటరితనం, డిప్రెషన్, స్ట్రెస్‌ నుంచి రిలీఫ్ అవుతారని తాజా అధ్యయనం తెలిపింది.

సాధారణంగా ఆఫీసులో అపోజిట్ జెండర్స్ క్లోజ్ అయినప్పుడు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం కామన్. మరీ ఎక్కువ క్లోజ్ అయితే గత లైంగిక అనుభవాల గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. సెక్స్ స్టోరీలు, సెక్స్ జోక్స్ షేర్ చేసుకుంటారు. ఇలాంటివి పంచుకోవడం, నవ్వుకోవడం వల్ల మైండ్‌ రిలాక్స్ అవుతుందని చెప్తున్నారు పరిశోధకులు. వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని అంటున్నారు. అయితే ఇష్టం లేని ఫ్లర్టింగ్‌ మాత్రం లైంగిక వేధింపుగానే పరిగణించబడుతోందని వివరించారు. ఒక అమ్మాయి పెరిగిన వాతావరణంలో సెక్స్ గురించి మాట్లాడటమే తప్పని భావించినప్పుడు.. ఒక అబ్బాయి దాని గురించి ఆమె ముందు మాట్లాడితే కచ్చితంగా అపార్థం చేసుకుంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా బాస్ ఫ్లర్టింగ్‌ను అమ్మాయిలు అసలు ఇష్టపడరని.. అలాంటప్పుడు ఓపెన్‌గా చెప్పడం బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read More...    అమ్మే సర్వస్వం.. ప్రపంచంలోనే బెస్ట్ మదర్స్‌గా ఫీలవుతున్న 73 శాతం మంది తల్లులు


Similar News