Health Tips: వ్యాయామం చేసిన వెంటనే ఆ పని అస్సలు చెయ్యొద్దు..! ఏం జరుగుతుందంటే..
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత రోజుల్లో అందం, ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకోసం ప్రతిరోజూ వ్యాయామాలు, జిమ్‌లో రకరకాల వర్కవుట్లు చేస్తున్నవారు చాలా మందే ఉంటారు.
దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత రోజుల్లో అందం, ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకోసం ప్రతిరోజూ వ్యాయామాలు, జిమ్‌లో రకరకాల వర్కవుట్లు చేస్తున్నవారు చాలా మందే ఉంటారు. ఇవి శరీరానికి బలాన్ని, మానసిక వికాసాన్ని కూడా కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే కొందరు వ్యాయామాల సందర్భంగా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మధ్య మధ్యలోనే కాకుండా.. వర్కవుట్స్ పూర్తికాగానే వెంటనే నీళ్లు తాగేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు హెల్త్ అండ్ ఫిట్‌నెస్ నిపుణులు. ఎందుకో చూద్దాం.
* ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి : సాధారణంగా వ్యాయామాలు చేసేటప్పుడు శరీరం నుంచి చెమట బయటకు పోతుంది. దీంతో నీరు మాత్రమే కాకుండా, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లు కూడా బయటకు పోతాయని నిపుణులు చెప్తున్నారు. కాగా ఈ సందర్భంలో ఎక్సర్‌సైజ్ ముగిసిన వెంటనే నీళ్లు తాగితే.. అప్పటికే బాడీలోని ఎలక్ట్రోలైట్ కంటెంట్ తగ్గి ఉండటంవల్ల, ఒక్కసారిగా నీటిశాతం పెరగడంవల్ల కండరాల నొప్పులు, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వెంటనే నీరు తాగవద్దు.
* కండరాలు పట్టేయడం : వ్యాయామం తర్వాత బాడీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వెంటనే నీళ్లు తాగితే కణజాలంలో నీటిశాతం పెరుగుతుంది. ఇది కండరాలు పట్టేసేందుకు కారణం అవుతుంది. అందుకే వర్కవుట్స్ పూర్తయ్యాక కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు నీరు తాగకపోవడం మంచిది.
* ఈ పదార్థాలు తీసుకుంటే బెటర్ : వర్కవుట్స్ చేసిన వెంటనే శరీరంలో తగిన శక్తి, ఎలక్ట్రోలైట్‌లు తక్కువగా ఉంటాయి. కాబట్టి కాసేపు ఆగి శక్తినిచ్చే పండ్లు, ఆహారాలు ఏవైనా తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అరటి పండు తినడంవల్ల ఇది కండరాలకు బలాన్ని, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే వెజిటేబుల్ సలాడ్స్, వెజ్ బిర్యానీ, బాదం, వాల్ నట్స్, ఖర్జూర వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే ఒక కప్పు పెరుగు తినడం కూడా మీ జీవక్రియరేటును పెంచుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More..
ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? కచ్చితంగా ఫాలో కావాల్సిందే...