Hidden Camera:రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారా?..అయితే వెంటనే ఇలా తెలుసుకోండి!

ఈ మధ్య కాలంలో హోటళ్లలో సీక్రెట్ కెమెరాలు బయటపడుతున్నాయి. తాజాగా ఏపీలోని ఓ కాలేజీలో కూడా హిడెన్ కెమెరాలు బయటపడ్డ ఘటన సంచలనంగా మారింది.

Update: 2024-08-30 14:52 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో హోటళ్లలో సీక్రెట్ కెమెరాలు బయటపడుతున్నాయి. తాజాగా ఏపీలోని ఓ కాలేజీలో కూడా హిడెన్ కెమెరాలు బయటపడ్డ ఘటన సంచలనంగా మారింది. వాస్తవానికి హోటల్ గదుల్లో, వాష్‌ రూంలలో సీక్రెట్ కెమెరాలను ఉంచడం అనేది దారుణమైన విషయంగా చెప్పవచ్చు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అయితే ఇటువంటి ప్రమాదం బారిన పడకుండా ఉండటం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈ సీక్రెట్ కెమెరాల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి, వాటిని ఎలా కనిపెట్టాలో తెలుసుకోండి.

ఈ టిప్స్ పాటిస్తే సీక్రెట్ కెమెరాలను ఇట్టే కనిపెట్టవచ్చు.

*గదిలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా..లేదా అనే విషయాన్ని మొబైల్ ఫోన్ కెమెరాతో గుర్తించవచ్చు.

*సాకెట్స్, బల్బ్ హోల్డర్స్, గడియారాలు, మిర్రర్లు, అడాప్టర్లలో సీక్రెట్ కెమెరాలను ఉంచుతారు.

* రూమ్ లోని అన్ని వస్తువులను క్షుణ్నంగా గమనించండి. అనుమానం వస్తే నిర్వాహకులకు ఇన్ఫార్మ్ చేయండి.

*రూంలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి మన ఫోన్ కెమెరా ఆన్ చేస్తే సీక్రెట్ కెమెరా ఉన్న చోట చిన్న లైట్ కనిపిస్తుంది.(మొబైల్ కెమెరా ఆన్ చేసి, స్కాన్ చేయాలి) ఆ సమయంలో మొబైల్ కెమెరా ఒక్కోసారి అక్కడేదో ఉన్నట్లు ఫోకస్ చేస్తుంది. అలా చేసిన చోట ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్లుగా గుర్తించాలి.

*వీటిని కనిపెట్టేందుకు హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ కూడా ఉన్నాయి.

*కొన్న రకాల సీక్రెట్ కెమెరాలు డేటాను ప్రసారం చేయడానికి బ్లూటూత్‌ని ఉపయోగిస్తాయి. బ్లూటూత్ పరికరాల కోసం స్కాన్ చేయడానికి మీ Android ఫోన్‌ని ఉపయోగించండి.

*కొన్ని సార్లు ఈ సీక్రెట్ కెమెరాలు వైఫె నెట్‌వర్క్‌తో పనిచేస్తూ ఉంటాయి. అవి రికార్డ్ చేసే వీడియోని వైఫై ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తూ ఉంటాయి.

అందువల్ల మీరు గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడ వైఫై నెట్‌వర్క్స్ ఏవేవి ఉన్నాయో గమనించండి. ఇందుకోసం మీరు WiFiman లేదా NetSpot వంటి నెట్‌వర్క్ స్కానర్ యాప్స్ కూడా వాడొచ్చు.


Similar News