#FearFoodChallange..మానసికంగా ఎఫెక్ట్

ప్రజెంట్ Fear Food Challange సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఏ ఆహారం గురించి అయితే భయపడుతమో.. దాన్ని కెమెరా ముందు తినడమే ఈ ట్రెండ్ ఉద్దేశ్యం. కాగా దీని వల్ల

Update: 2024-06-23 13:35 GMT

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ Fear Food Challange సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఏ ఆహారం గురించి అయితే భయపడుతమో.. దాన్ని కెమెరా ముందు తినడమే ఈ ట్రెండ్ ఉద్దేశ్యం. కాగా దీని వల్ల హెల్త్ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిజానికి ఈటింగ్ డిజార్డర్ తో స్ట్రగుల్ అవుతున్న వారి గురించి ఈ ఛాలెంజ్ డిజైన్ చేయగా.. థెరపీలాగా వర్క్ చేస్తుందని అనుకున్నారు. కానీదీన్ని అటెంప్ట్ చేస్తే మెంటల్ హెల్త్ కండిషన్స్ వరెస్ట్ అయిపోయే ఛాన్స్ ఉందంటున్నారు.

కాగా ఇందులో "ఫియర్ ఫుడ్ జార్" నుంచి ఫుడ్ ఐటెం యాదృచ్ఛికంగా ఎంచుకుని.. కెమెరా ముందు దానిని తినడం ద్వారా తమ ధైర్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ జార్ లో

మ్యాగ్జిమమ్ ఎక్కువ కెలరీలతో కూడిన జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. అయితే ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు ఇలా ఫోర్సుబుల్ గా ఇష్టం లేని ఆహారం తినడం వల్ల తీవ్ర ఆందోళన, గిల్ట్ తో బాధపడతారని నిపుణులు చెప్తున్నారు. హార్మ్ ఫుల్ బిహేవియర్స్ కు దారితీస్తాయని అంటున్నారు. ఇతరులకు హాని చేసే ప్రవర్తన కలిగి ఉండొచ్చని చెప్తున్నారు.


Similar News