ఐడీతో మాయ చేయలేరు.. ముఖం చూసి వయసు చెప్పేస్తున్న టెక్నాలజీ

ఆల్కహాల్ లాంటి ఏజ్ రిస్ట్రిక్టెడ్ ఐటెమ్స్ కొనుగోలు చేయాలంటే సూపర్ మార్కెట్‌లో ఐడీ కార్డును చూపించడం తప్పనిసరి

Update: 2023-01-10 09:12 GMT

దిశ, ఫీచర్స్ : ఆల్కహాల్ లాంటి ఏజ్ రిస్ట్రిక్టెడ్ ఐటెమ్స్ కొనుగోలు చేయాలంటే సూపర్ మార్కెట్‌లో ఐడీ కార్డును చూపించడం తప్పనిసరి. అయితే ఫేక్ ఐడీతో ఇలాంటి వస్తువులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. 'ఫేషియల్ ఏజ్ ఎస్టిమేషన్' టెక్నాలజీతో సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది యూకే. సూపర్ మార్కెట్ చైన్‌లలో జరిపిన ట్రయల్ ఆశాజనక ఫలితాలను చూపించగా.. గుర్తింపు తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండానే వయసును నిర్ధారించేందుకు కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగిస్తుంది ఫేషియల్ స్కాన్. హోమ్ ఆఫీస్ ఆఫ్ యూకే నిర్వహించిన ఈ ట్రయల్.. ఎలాంటి మానవ పరస్పర చర్య లేకుండానే.. కేవలం మూడు నిమిషాల్లో ముఖాన్ని చూసి వయసు అంచనా వేస్తుంది. 'యోటీ' కంపెనీ రూపొందించిన ఈ టెక్నాలజీ.. 99శాతానికిపైగా కచ్చితమైన ఫలితాలను కలిగి ఉంది.

మానవ ముఖం, దానితో పాటు వచ్చే వయస్సు డేటాపై శిక్షణ పొందిన న్యూరల్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి Yoti మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించింది. 99.65 శాతం ఖచ్చితత్వంతో 13-17 ఏళ్ల వయస్సు గల వారిని 23 ఏళ్లలోపుగా అంచనా వేయగలదు. 6-11 సంవత్సరాల వయస్సు గల వారిని.. 98.91 శాతం ఖచ్చితత్వంతో 13 ఏళ్లలోపుగా అంచనా వేస్తుంది. కంపెనీ దాని అల్గారిథమ్‌లో లింగం, స్కిన్ టోన్ పక్షపాతాన్ని తగ్గించిందని పేర్కొంది. అయితే డేటా ప్రకారం మగవారి కంటే ఆడవారికి, లేత రంగుల కంటే ముదురు చర్మపు టోన్‌లకు కొంచెం ఎక్కువ సగటు అంచనా లోపం ఉంది.

ఇవి కూడా చదవండి : శిలలపై శిల్పాలు చెక్కుతున్న రోబో

Tags:    

Similar News