వేసవిలో హెల్మెట్ వాడుతున్నారా? .. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి !

టూ వీలర్ నడిపేటప్పుడు మనం హెల్మెట్ వాడుతుంటాం. రోడ్డు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయట పడటానికి, అలాగే దుమ్మూ, ధూళి, ఎండ, వాన నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యం.

Update: 2024-04-03 14:33 GMT

దిశ, ఫీచర్స్ : టూ వీలర్ నడిపేటప్పుడు మనం హెల్మెట్ వాడుతుంటాం. రోడ్డు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయట పడటానికి, అలాగే దుమ్మూ, ధూళి, ఎండ, వాన నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యం. అయితే సమ్మర్‌లో హెల్మెట్ వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

* కొందరు తమ జుట్టు మీద పెట్టిన శ్రద్ధ హెల్మెట్ ధరించే విషయంలో చూపలేకపోతుంటారు. దానిపై డస్ట్ ఉన్నా క్లీన్ చేయకుండా వాడుతుంటారు. దీనివల్ల జుట్టు పాడవుతుంది. హెల్మెట్‌లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి వల్ల స్కిన్ అలెర్జీలు, తలనొప్పి, కంటి సమ్యలు, లంగ్స్ ప్రాబ్లమ్స్ వంటివి తలెత్తే చాన్స్ ఉంటుంది.

* హెల్మెట్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే దానిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లోపలి భాగంలో డస్ట్ పేరుకుపోకుండా చూసుకోవాలి. మృదువైన బ్రష్‌తో కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైనా క్లీన్ చేయాలి. దీంతో దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది.

* సమ్మర్‌లో హెల్మెట్ ధరించినప్పుడు ఉక్కబోతల వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. ఇక ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అయితే ఈ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఓ వైపు చికాకు, మరోవైపు చెమటతో దుర్వాసన ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించేకంటే ముందు మీ జుట్టును వకర్ చేసేలా కాటన్ రుమాలు లేదా స్కార్ఫ్ వంటి వాటితో జుట్టును కవర్ చేయాలి. వీటిపై హెల్మెట్ ధరిస్తే జుట్టుకు రక్షణగా ఉంటుంది. పైగా హెల్మెట్‌కి చెమట వాసన అంటుకోకుండా ఉంటుంది.


Similar News