ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమ.. అరుదైన సైకియాట్రిక్ డిజార్డర్స్..
మానసిక రుగ్మతలు అనేక రకాలుగా ఉంటాయి. నిపుణులు వీటిని ఈజీగా గుర్తించగలుగుతారు. తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా నివారణ కూడా సాధ్యమవుతుంది. కానీ చాలామంది సైకియాట్రిస్టులు తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒక్క కేసు
దిశ, ఫీచర్స్ : మానసిక రుగ్మతలు అనేక రకాలుగా ఉంటాయి. నిపుణులు వీటిని ఈజీగా గుర్తించగలుగుతారు. తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా నివారణ కూడా సాధ్యమవుతుంది. కానీ చాలామంది సైకియాట్రిస్టులు తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒక్క కేసు కూడా చూడని, అరుదైన, విచిత్రమైన సిండ్రోమ్స్ కూడా ఉన్నాయని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీకి చెందిన మార్క్ గ్రిఫిత్స్ చెప్తున్నారు.
ఫ్రెగోలి సిండ్రోమ్
ఫ్రెగోలి సిండ్రోమ్ ఉన్న వ్యక్తి తనకు తానే వేర్వేరు రూపాలుగా తరచూ ఊహించుకుంటాడు. ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు కొన్ని సార్లు తమ ప్రవర్తనవల్ల మారువేషంలో ఉన్నారని నమ్మే వారి ద్వారా హింసించబడతారు. ఈ రుగ్మతకు ఇటాలియన్ థియేటర్ నటుడు లియోపోల్డో ఫ్రెగోలీ పేరు పెట్టాడు. అతను వేదికపై ఉన్నప్పుడు తన రూపాన్ని త్వరగా మార్చగల అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఇది సాధారణంగా బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ వంటి ఇతర మానసిక రుగ్మతలతో సంభవిస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్ ఇంజ్యూరి, పార్కిన్సన్స్ వ్యాధి ట్రీట్మెంట్‌లో లెవోడోపా ఔషధాన్ని ఉపయోగించడం వల్ల కూడా సంభవించవచ్చు.
కొటార్డ్ సిండ్రోమ్
కొటార్డ్స్ సిండ్రోమ్‌ను ‘వాకింగ్ కార్ప్స్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. ఈ రుగ్మత కలిగిన రోగులు.. ప్రజలు తమ ఉనికిని గుర్తించడం లేదన్న భ్రమలో ఉంటారు. మరికొందరు తమ బాడీ పార్ట్స్ మిస్ అయ్యాయని నమ్ముతారు. ఈ సిండ్రోమ్‌కు 19వ శతాబ్దపు ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ జూల్స్ కోటార్డ్(Jules Cotard) పేరు పెట్టాడు. స్కిజోఫెర్నియా, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటివి ఈ సిండ్రోమ్‌కు దారితీసే ప్రమాద కారకాలు. అరుదైన పరిస్థితిని తగ్గించడానికి యాంటీ డిప్రెసెంట్స్, మూడ్ స్టెబిలైజర్స్ అండ్ ఎలక్ట్రోకాన్‌క్లూజివ్ థెరపీతో ట్రీట్మెంట్ అందిస్తారు.
ఎలియన్ హ్యాండ్ సిండ్రోమ్
విచిత్రమైన న్యూరోలాజికల్ డిజార్డర్‌లలో ఇదొకటి. ఇది వ్యాధితో బాధపడుతున్న వారు సంబంధం లేని ఆలోచనలో పడిపోతారు. కొన్నిసార్లు తమ చేతులు తమకే సొంతమని ఫీలవుతుంటారు. మరికొన్నిసార్లు తమ చేతులు తమకు చెందినవి కాదని భావిస్తుంటారు. ఈ విధమైన ఎలియన్ హ్యాండ్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సాధారణంగా సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్‌లను కలిగి ఉంటారు. అంటే తమ చేతులు చేసే పనులకు, తమకు సంబంధం లేని భ్రమిస్తుంటారు. స్ట్రోక్స్, ప్రిసాన్ డిసీజ్, బ్రెయిన్ ట్యూమర్స్, మూర్ఛలు వంటివి అనుభవించిన వ్యక్తుల్లో భయం కారణంగా ఈ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది.
ఎక్బోమ్ సిండ్రోమ్
ఎక్బోమ్ సిండ్రోమ్ అనేది స్పర్శకు సంబంధించిన భ్రాంతి. చిన్నపాటి దురద కలిగినా తమకు ఏదో జరిగిందని, పరాన్న జీవులు సోకాయని ఫీలవుతుంటారు. ఏవో కీటకాలు తమ చర్మంపై పాకుతున్నాయనే అనుభూతిని పొందుతారు. ఈ విధమైన రుగ్మతకు కార్ల్ ఎక్బోమ్ అనే స్వీడిష్ న్యూరాలజిస్ట్ 1930ల చివరలో పేరు పెట్టాడు. నిజానికి ఇది ఆర్గానిక్ బ్రెయిన్ డిసీజ్, పారానోయిడ్ పర్సనాలిటీ డిజార్డర్, పారానోయిడ్ స్కిజోఫ్రెనియా, న్యూరోసిస్ వంటి అనేక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆల్కహాల్, కొకైన్ ఇతర మత్తు పదార్థాల అలవాటు ఉన్నవారు సడెన్‌గా మానేసినప్పుడు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొ్ంటారు. వీరికి థాలమస్ అని పిలువబడే మెదడులోని ఒక భాగంలో గాయాలు ఉన్నట్లు నివేదించబడింది.
ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ సిండ్రోమ్
దీనిని టాడ్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సెన్స్ ఆఫ్ బాడీ ఇమేజ్. దృష్టి, వినికిడి, స్పర్శ, స్పేస్, టైమ్ వంటి భావ వ్యక్తీకరణలో భ్రమకు లోనవుతారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఫీలవుతుంటారు. ఉదాహరణకు ఒక వస్తువు చిన్నదిగా కనిపిస్తున్నా చాలా పెద్దగా ఉందని చెప్తుంటారు. రుగ్మత కారణంగా వారి మెదడు ఆ విధమైన సంకేతాలను కలిగించడం వల్ల ఇలా ప్రవర్తిస్తారు.
ఎరోటోమానియా
ఇది ఒక భ్రమను కలిగించే రుగ్మత. వ్యక్తులు తమను తాము అతిగా ఊహించుకుంటుంటారు. ఒక సాధారణ వ్యక్తి ఉన్నత స్థాయికి చెందిన ఇతర వ్యక్తి తనతో ప్రేమలో ఉందని గొప్పలు చెప్పుకుంటాడు. ఎవరైనా మంచి సలహాలు ఇవ్వబోతే తనకు వ్యతిరేకంగా చెప్తున్నారని భావిస్తారు. ఇతరులను అస్సలు నమ్మరు.
కాప్‌గ్రాస్ సిండ్రోమ్
కాప్‌గ్రాస్ అనేది ఒక మెంటల్ కండిషన్. ఈ రుగ్మతతో ఉన్న వ్యక్తి తనకు అత్యంత దగ్గరి వ్యక్తిని, తనకు పరిచయమున్న వ్యక్తిని కూడా మనసులో మోసగాడిగా భావిస్తాడు. తమతో సన్నిహితంగా ఉండే వారికి భరోసా ఇవ్వడంలో తామే ప్రత్యామ్నాయంగా ఫీలవుతుంటారు. పురుషుల కంటే ఆడవారిలో ఈ రుగ్మతలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. వృద్ధాప్యం, కొన్ని రకాల బ్రెయిన్ డిజార్డర్స్ వల్ల ఇది సంభవించవచ్చు.
Also Read..
పరగడుపున తినకూడనివి.. స్వీట్ బ్రేక్ ఫాస్ట్ అవాయిడ్ చేయాలని సూచన