పదాల పదనిసలు.. మీ మైండ్‌ సెట్‌ను కూడా మార్చగలవు !

కొన్ని మాటలు లేదా పదాలు మనిషిని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి. కొన్నిసార్లు నిరాశకు గురిచేస్తాయి.

Update: 2024-02-08 13:02 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని మాటలు లేదా పదాలు మనిషిని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి. కొన్నిసార్లు నిరాశకు గురిచేస్తాయి. మాటతీరును బట్టే మనుషుల్లో ప్రతికూల, సానుకూల స్పందనలు వ్యక్తం అవుతుంటాయి. మాట తీరును బట్టే ఉల్లాసం, ఉత్సాహం, నిరాశా, నిస్పృహలు వ్యక్తం అవుతుంటాయి. అందుకే ‘‘వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు’’ అన్నారు పెద్దలు. రోజువారీగా మీరు వాడుతున్న, తరచూ వింటున్న మాటలకు మీ మెదడు ఎలా స్పందిస్తుందనే దానిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. కొన్ని పదాలు మీపై ప్రతికూల ప్రభావం చూపడం కారణంగా శరీరంలో స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అదే సానుకూల ప్రభావం చూపే పదాలు అయితే మీలో ఆనందాన్ని ప్రేరేపిస్తాయి. సక్సెస్‌కు కారణం అవుతాయి.

ఆలోచన తీరు

మీరు ఆలోచించే తీరు, ఉపయోగించే పదాలు మీ అనుభూతిపై ప్రభావం చూపుతాయి. అవి స్ఫూర్తిదాయకంగా, ప్రేరణనిచ్చేవిగా ఉన్నప్పుడు మీకు మేలు జరుగుతుంది. అందుకు భిన్నమైనవిగా ఉంటే మీపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే మీ మాటలను మార్చుకోవడంవల్ల మీ జీవితాలను మార్చుకోవచ్చు’’ అంటున్నారు నిపుణులు. ‘మాటలు బాధిస్తాయా?.. తప్పకుండా పెయిన్ ఫుల్ పదాల ప్రాసెసింగ్ సమయంలో బ్రెయిన్ యాక్టివేషన్’ అనేది మీ జీవితంపై ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

భావోద్వేగాల ప్రేరణ

పదాలు ప్రతికూల భావోద్వేగాలను ఎలా లేబుల్ చేస్తాయో ఒకసారి పరిశీలిస్తే మీరు ‘కొంచెం నిరాశకు లోనయ్యారు (feeling devastated)’’ అని చెప్పడం కంటే ‘విధ్వంసానికి గురైన అనుభూతికి లోనయ్యారు (a bit disappointed)’’ అని చెప్పడం భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇతరుల విషయంలో మీరు ఈ పదాలను వాడితే వారిపై, అలాగే ఇతరులు మిమ్మల్ని సంబోధిస్తూ వాడితే మీపై వాటి ప్రభావం ఉంటుంది. మొదటి పదం కొంచెం తక్కువ ప్రతికూలత కలిగిస్తే, రెండవది తీవ్రమైన ప్రతికూలతకు కారణం అవుతుంది. దానిని వ్యక్తి స్వీకరించడాన్ని బట్టి మైండ్ సెట్ మారుతుంది.

ఫెయిల్యూర్ నుంచి నమ్మకం వరకు

ఫెయిల్యూర్ నుంచి నమ్మకం వరకు అనేక వర్డ్స్ మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఏ విషయంలో అయినా ‘కాదు’ అని వాడే బదులు ‘ఇంకా లేదు’ అనే పదంతో భర్తీ చేయడంవల్ల కలిగే ప్రభావం భిన్నంగా ఉంటుంది. మీరు గోల్స్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు వైఫల్యాన్ని సూచించే ‘కాదు’ అని వాడితే నిరాశ, ఓటమి ఎదురు కావచ్చు. ఆశాజనకంగా ఉండే ‘ఇంకా లేదు’ అని ఉపయోగించడం వల్ల మీలో ప్రయత్నానికి ఉసిగొల్పుతుంది. అలాగే ‘‘నేను చేయలేను’’ అని చెప్పడం అనేది అవకాశాలను విస్మరిస్తుంది. బదులుగా ‘‘నేను ప్రయత్నిస్తాను’’ అని చెప్తూ ప్రయత్నించడం మీ దృక్పథాన్ని మార్చివేస్తుంది. సక్సెస్‌తోపాటు అవకాశాల ప్రపంచాన్ని మీ ముందు ఉంచుతుంది.

పర్సనలైజేషన్ వద్దు 

మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటే.. అలాగే తయారువుతారని, మీలోని తీవ్రమైన ఊహలు, ఆలోచనలకు అనుగుణంగా మీ మైండ్ సెట్ మారుతుందని మానసిక శాస్త్రం చెప్తుంది. అంటే మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే నిజంగానే బలహీన పడిపోతారు. బలవంతులుగా భావిస్తే నిజంగానే బలంగా తయారవుతారు. ఇది చాలా విషయాల్లో వర్తిస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు ‘stupid’ లేదా "lazy" అని భావించుకోవడం, పర్సనలైజింగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చుకోవడం చాలా హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందని గుర్తుంచుకోండి.

రెండు పదాలు.. ఎంతో తేడా!

ఏదైనా ‘చేయాలి’ అలాగే ‘చేయడానికి ప్రయత్నిద్దాం’? అనే రెండు పదాల మధ్య చాలా తేడా ఉంటుంది. మొదటిది విధిని సూచిస్తుంది. మీరు నిజంగా చేయకూడదు అనుకున్నప్పుడే రెండోది వాడటం మంచిది. కొన్నిసార్లు మీరు వర్క్‌ప్లేస్‌లో లేదా ఇతర చోట్ల మీపై నమ్మకంతో ఒక ఒకరు పని చెప్పినప్పుడు ‘‘నేను చేయలేను’’ ఆ క్షణంలో మీలో మీలో నెగెటివిటీని పెంచుతుంది. అంటే ఆ పనిచేయడానికి మొగ్గు చూపరు. అలాగే ఎదుటి వ్యక్తిలో కూడా మీపై నెగెటివిటీ ఏర్పడేలా చేస్తుంది. అదే మీకు ఇష్టం లేకుంటే, మీరు వేరే ఇబ్బందిలో ఉంటే ‘నేను ఎలా చేయగలను? కానీ’ అంటూ మీ పరిస్థితిని వివరించడం సానుకూలతకు కారణం అవుతుంది. ఇక్కడ రెండు పదాల మధ్య తేడా ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.


Similar News