చిన్న వయస్సులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుంది?.. రాకుండా ఏం చేయాలి?
ఒకప్పుడు ఏజ్‌బార్ అయిన వ్యక్తుల్లో మాత్రమే తెల్లజుట్టు కనబడేది. కానీ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిని ఈ సమస్య వేధిస్తోంది. జుట్టు నెరవడం కారణంగా మిడిల్ ఏజ్‌వాళ్లు పెద్దగా ఫీల్ కాకపోవచ్చు.
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్‌బార్ అయిన వ్యక్తుల్లో మాత్రమే తెల్లజుట్టు కనబడేది. కానీ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిని ఈ సమస్య వేధిస్తోంది. జుట్టు నెరవడం కారణంగా మిడిల్ ఏజ్‌వాళ్లు పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. కానీ యువతీ యువకుల్లో అది ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వైట్ హెయిర్స్ బయటకు కనబడకుండా కలర్స్ వాడుతున్నారు. అయితే యువతలోనూ వైట్ హెయిర్స్ ఎందుకు వస్తున్నాయి? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతోపాటు పర్యావరణ ప్రభావాలు, హర్మోనల్ ఇంబ్యాలెన్స్, మానసిక ఒత్తిడి, ఆందోళన, మద్యపానం, ధూమపానం, పోషకాల లోపం వంటివి తెల్లజుట్టు రావడానికి కారణం అవుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం, అనీమియా, థైరాయిడ్ వంటి హార్మోన్ల ప్రభావం, జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అయితే జన్యుపరమైన సమస్యలు నివారించడం సాధ్యపకడపోవచ్చు కానీ, ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెల్లజుట్టు చిన్న వయస్సులోనే రాకుండా నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉండాలంటే కెమికల్స్ మిక్స్ అయిన షాంపూలను వాడకూడదు. ఆర్గానిక్ షాంపూలను వినియోగించాలి. కొంతమంది సువాసనకోసం మార్కెట్‌లో లభించే హెయిర్ స్ప్రేలు వాడుతుంటారు. వీటివల్ల జుట్టు రాలడంతోపాటు తెల్లజుట్టు త్వరగా వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే ఎటువంటి కెమికల్స్ లేని సహజ సిద్ధంగా లభించే బాదం, కొబ్బరి, ఆలివ్ ఆయిల్స్‌ను వినియోగించడం బెటర్. అలాగే ఫుడ్స్ విషయానికి వస్తే జంక్ ఫుడ్స్, ప్యాకేజింగ్ ఫుడ్స్‌లలో కెమికల్స్ ఎంతోకొంత కలిసి ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వీటన్నింటితోపాటు మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలవల్ల తెల్లజుట్టు రావడాన్ని పూర్తిగా అరికట్టలేకపోవచ్చు కానీ, చిన్న వయస్సులోనే రావడాన్ని మాత్రం నివారించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.