Health Tips : శృంగారంతో ఈ వ్యాధులకు చెక్.. అవేంటో తెలుసా..

శృంగారం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ లాంటిది.

Update: 2024-08-26 05:28 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : శృంగారం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ లాంటిది. దీన్ని ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే, దాని గురించి మరిన్ని కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు, ఉల్లాసంగా ఉండేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అంతే కాదు రతి చేయడం ద్వారా అనేక వ్యాధులకు కూడా చెక్ పెట్టొచ్చంటున్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్రెషన్..

శృంగారం సమయంలో సెరోటోనిన్, డోపమైన్ శరీరంలో విడుదలవుతాయని. ఇవి మూడ్ బూస్టర్‌లుగా పనిచేస్తాయని చెబుతున్నారు శృంగార నిపుణులు.

మైగ్రేన్..

రతి చేసే సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది మాత్రల కంటే తలనొప్పిని త్వరగా నయం చేస్తుందని చెబుతున్నారు.

నిద్రలేమికి..

నిద్రలేమికి శృంగారం సహజ ఔషధంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే రాత్రిపూట రతి చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుందని చెబుతున్నారు.

హ్యాంగోవర్..

శృంగారం హ్యాంగోవర్ నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వాస్తవానికి ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ కారణంగా ఇది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఇది హ్యాంగోవర్ ను మాత్రమే కాదు దానితో సంబంధం ఉన్న నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుందంటున్నారు.

ఆర్థరైటిస్..

ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి రతి చేయడం మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో కార్టిసోన్ విడుదలవుతుందట.

గుండె జబ్బులు..

శృంగారం గుండెకు చాలా మేలు చేస్తుందట. కొన్ని అధ్యయనాల ప్రకారం వారానికి రెండుసార్లు రతి చేసే వ్యక్తులు గుండెపోటు నుండి మరింత రక్షించబడతారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి రొమాన్స్ అనేది ఒక వ్యాయామం లాంటిదని, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, అలాగే గుండెను బలపరుస్తుందని చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News