ఎటువంటి వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గుతున్నామని సంతోష పడితే నష్టపోయినట్లే.. ఈ వ్యాధులవల్ల కూడా అలా జరగవచ్చు

ప్రస్తుతం అధిక బరువును ఒక అన్‌హెల్తీ కండిషన్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పలువురు వెయిట్‌లాస్ కోసం రకరకాల వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయితే

Update: 2024-03-14 06:27 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అధిక బరువును ఒక అన్‌హెల్తీ కండిషన్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పలువురు వెయిట్‌లాస్ కోసం రకరకాల వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయితే కొందరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఫాస్ట్‌గా బరువు తగ్గుతుంటారు. అసలు విషయం తెలియక తాము స్లిమ్‌గా తయారవుతున్నామని భావించే వారు లేకపోలేదు. కానీ ఇలా వేగంగా బరువు తగ్గడం అనేది అనారోగ్య సూచికమని, పలు వ్యాధుల కారణంగా అలా జరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ కారణలు ఏమిటో చూద్దాం.

థైరాయిడ్, డయాబెటిస్

సాధారణంగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోయినా, ఎటువంటి వ్యాయామాలు చేయకపోయినా బరువు తగ్గడానికిగల కారణాల్లో థైరాయిడ్ ఒకటి. శరీరంలో ఇది ఎక్కువ ప్రభావం చూపినప్పుడు అనుకోకుండా వెయిట్‌లాస్ అవడం స్టార్ట్ అవుతుంది. కాగా ఇందులో కూడా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం కారణంగా సంబంధిత థైరాయిడ్ గ్రంథి ఓవర్ యాక్టివేట్‌గా ఉంటుంది. దీనివల్ల సదరు వ్యక్తులు ఫాస్ట్‌గా బరువు తగ్గే చాన్స్ ఉంటుంది. మరొక ప్రధాన కారణం డయాబెటిస్. దీనివల్ల కూడా అకస్మాత్తుగా బరువు తగ్గుతుంటారు. ప్రస్తుతం చాలామందిలో తెలియకుండానే ఇది జరిగిపోతోంది. కాబట్టి సడెన్‌గా మీ శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం బెటర్.

డిప్రెషన్, టీబీ, క్యాన్సర్

మారుతున్న జీవన శైలి కారణంగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బాధితులు గతంకంటే పెరుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా నిద్ర, ఆహార నియమాలు సక్రమంగా ఉండటం లేదు. శరీరంలోని అవయవాల పని తీరును మందగించేలా డిప్రెషన్ ప్రభావం చూపుతుంది. అలాగే వెయిట్‌ లాస్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డిజార్డర్‌కు తగిన చికిత్స తీసుకోవాలి. తరచుగా ఒత్తిడికి గురికావడం, ఆకలి, దప్పికలు సమయానికి ఉండకపోవడం వంటి లక్షణాలు డిప్రెషన్‌కు మందు కనిపిస్తుంటాయి. ఇక టీబీ లేదా క్షయ వ్యాధి బాధితులు కూడా అకస్మాత్తుగా బరువు తగ్గుతుంటారు. ఇది లంగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపడంవల్ల వెయిట్‌లాస్ అవుతారు. అలాగే క్యాన్సర్ బాధితుల్లో రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. ఫలితంగా వారు వేగంగా బరువు తగ్గుతారు. పలు వ్యాధులతో ముడిపడి ఉన్నందున ఎటువంటి ప్రయత్నం లేకుండానే మీరు బరువు తగ్గడం ప్రారంభిస్తే, మీ శరీరంలో ఏదో జరుగుతుందని అనుమానించాలని, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News