డర్టీ హార్మోన్స్ అంటే ఏమిటి?.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఏం చేయాలి?

మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని హార్మోన్లు కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటిలో సమతుల్యత లోపిస్తూ ఉంటుంది. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం అవుతుంటాయి.

Update: 2024-04-04 12:58 GMT

దిశ, ఫీచర్స్ : మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని హార్మోన్లు కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటిలో సమతుల్యత లోపిస్తూ ఉంటుంది. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం అవుతుంటాయి. ఫలితంగా శరీరంలో కొన్ని రకాల ఉప హార్మోన్లకు సంబంధించిన జీవక్రియలు ఏర్పడుతుంటాయి. వీటినే డర్టీ హార్మోన్స్‌గా(metabolites) పేర్కొంటారు. స్త్రీలలో ఇవి మంచికంటే, హానినే ఎక్కువ కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

లక్షణాలు - ప్రభావం

డర్టీ హార్మోన్లు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే గనుక తరచుగా ఉబ్బరం, రొమ్ము భాగంలో సున్నితత్వం, దురద, వెరైటీ రాషెస్, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేయడంవల్ల అధిక బరువు పెరగడం, యాక్టివ్ నెస్ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తాయి. అంతే కాకుండా ఫైబ్రాయిడ్స్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా, అలాగే ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు. ఇక టెస్టోస్టెరాన్ లేదా ప్రొజెస్టెరాన్ రిలేటెడ్ డర్టీ హార్మోన్లు ఆండ్రోజెన్స్‌గా పనిచేయం కారణంగా జుట్టు రాలడం, మొటిమలు రావడం, కండరాల బలహీనత, కీళ్లలో నొప్పి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్, పీసీఓడీ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.

కాలేయంపై ఎఫెక్ట్

హార్మోన్ల ఉప ఉత్పత్తులైన డర్టీ హార్మోన్స్ అధికమైతే అవి కాలేయం పనితీరు మందగించే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే స్ట్రీలలో ఫెర్టిలిటీ డిక్లైన్, జుట్టు రాలడం, స్వరం మారిపోవడం, మొహంపై మొటిమలు లేదా వెంట్రుకల రావడం, గైనెకోమాస్టియా వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. హార్మోన్ లెవల్స్ కంటే, డర్టీ హార్మోన్ మెటబాలిజం ఎఫెక్ట్ అధికం కావడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు వైద్యుల వద్దకు వెళ్తే హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన టెస్టులు సూచిస్తారు.

నివారణ - చికిత్స

డర్టీ హార్మోన్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలంటే ప్రాబ్లమ్ గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతోపాటు ప్రతిసారి డర్టీ హార్మోన్లవల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా నివారణ చర్యలు పాటించడం మంచిది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పులు ఇందుకు దోహద పడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే తక్షణ పరిష్కారం కోసం చికిత్స, మెడికేషన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖంపై వెంట్రుకలు పెరగకుండా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నియంత్రించడానికి యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ ఉంటాయి. దీంతోపాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, ఆరోగ్య కరమైన సమతుల్య బరువును నిర్వహించడం, కెఫిన్, షుగరింగ్ ఫుడ్స్ తగ్గించడం, ఒత్తిడిలేని జీవన శైలిని అలవర్చుకోవడం చేయాలి.


Similar News