అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. డైట్‌లో చియా సీడ్స్ తీసుకోండి !
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. వెయిట్ తగ్గడానికి రకరకాల వ్యాయామాలు, ఆహారాలు ట్రై చేస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. వెయిట్ తగ్గడానికి రకరకాల వ్యాయామాలు, ఆహారాలు ట్రై చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి చియా విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలోని ఎక్స్‌ట్రా ఫ్యాట్‌ను బర్న్ చేయడంలో సహాయపడతాయి. చియా సీడ్స్‌లో ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షస్తాయి. చర్మంలో అకాల వృద్ధాప్య ఛాయల్ని నిరోధిస్తాయి. అంతేకాకుండా చియా సీడ్స్‌ను తగిన మోతాదులో తీసుకోవడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక నానబెట్టిన చియా గింజలను షేక్స్, స్మూతీస్, సలాడ్ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. అయితే పరిమితికి మించి కాకుండా ఒక మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండటం మంచిది. అప్పుడప్పుడూ చియా గింజలను తీసుకుంటూ ఉంటే అధిక బరువు తగ్గడంతోపాటు స్లిమ్ అండ్ ఫిట్‌నెస్ లుక్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు.