ప్రైవేట్ ప్లేస్‌లో దురద ఎందుకు వస్తుంది?.. రాకుండా ఏం చేయాలి?

కొన్ని సమస్యలు ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. అయినా వాటిని బయటకు చెప్పుకోలేకపోతుంటారు కొందరు. కుటుంబ సభ్యులతో చర్చించడానికి కూడా మొహమాటం అడ్డు వస్తూ ఉంటుంది.

Update: 2024-04-10 05:08 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని సమస్యలు ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. అయినా వాటిని బయటకు చెప్పుకోలేకపోతుంటారు కొందరు. కుటుంబ సభ్యులతో చర్చించడానికి కూడా మొహమాటం అడ్డు వస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి ప్రైవేట్ పార్టుల్లో దురద లేదా మంట. వాస్తవానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంటాయని, పురుషులతో పోల్చితే మహిళల్లోనే అధికంగా తలెత్తే చాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మర్మాంగాల్లో తరచుగా దురద, మంట వంటివి వస్తున్నాయంటే క్యాండిడా ఆల్బికన్స్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. దీనిని క్యాండిడయాసిస్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య కాస్త అధికంగా కనిపిస్తుందని చెప్తున్నారు. కాగా మానవ శరీరంలో సహజంగానే ఉండే వివిధ సూక్ష్మ జీవులతో ఈ ఫంగస్ కలిసి మనుగడ సాగిస్తుంది. ప్రమాదకరమైన సూక్ష్మజీవి కాకపోయినప్పటికీ కొన్నిసార్లు శరీరంలో సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనినే క్యాండియాసిస్ అంటారు.

స్త్రీలలో సమస్యకు కారణం ఇదే..

ప్రైవేట్ పార్టుల్లో దురదకు కారణమయ్యే క్యాండిడా ఆల్బికన్స్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా స్త్రీలలో తలెత్తడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రుతు చక్రం, ప్రెగ్నెన్సీ సమయాల్లో మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అలాగే హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ వాడటం, హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీలు వంటివి పొందడం వల్ల కూడా యోనిలోని పీహెచ్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తాయి. దీంతో ఫంగస్ డెవలప్ అవుతుంది.

పురుషుల్లో ఎందుకు వస్తుందంటే..

పురుషుల్లో క్యాండియాసిస్ ఇన్ఫెక్షన్ తలెత్తడానికి చెమట అధికంగా రావడం, ఆయా పరిస్థితుల్లో తడిగా ఉండే లో దుస్తులు ధరించడం కారణం అవుతున్నాయి. వీటివల్ల శరీరంపై చెమ్మ ఏర్పడటంవల్ల క్యాండిడా ఫంగస్ వేగంగా డెవలప్ అవుతుందని యూరాలజిస్టులు చెప్తున్నారు. దీంతోపాటు మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, డయాబెటిస్ బాధితుల్లో అయితే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పడిపోవడం, తరచూ యాంటీ బయాటిక్ యూజ్ చేయడం వంటివి క్యాండికా ఫంగస్ అభివృద్ధికి దోహదం చేస్తాయి.

నివారణ, చికిత్స

మర్మాంగాల్లో దురదకు వైద్య పరమైన చికిత్స అందుబాటులో ఉంది. అలాగే నివారణ చర్యలు కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే ఇన్ఫెక్షన్ సోకిందో లేదో గుర్తించడానికి డాక్టర్లు ముందుగా ‘జెర్మ్ ఐసోలేషన్ లేదా ‘బయోప్సీ’ వంటి టెస్టులను సజెస్ చేస్తారు. చాలా వరకైతే టెస్టులు లేకుండానే ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలోనే ఈ సమస్య తలెత్తే చాన్స్ ఎక్కువ కాబట్టి, అందుకు గిన విధంగా మెడిసిన్స్ సజెస్ చేస్తారు. అప్పుడు కూడా ప్రాబ్లం క్లియర్ కాకపోతే టెస్టులు నిర్వహించి అవసరమైన చికిత్సను ప్రారంభిస్తారు.


Similar News