ఇయర్‌బడ్స్‌తో ఇన్‌ఫెక్షన్స్.. ప్రాణాల మీదకు తెస్తున్న వినియోగం

ప్రస్తుతం ఇయర్ బడ్స్ వినియోగం సాధారణమైపోయింది.

Update: 2023-04-26 10:16 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఇయర్ బడ్స్ వినియోగం సాధారణమైపోయింది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, కాల్స్ మాట్లాడటం, పాడ్ కాస్ట్ వినడం, ఈజీగా క్యారీ చేయగలిగే ఫీచర్స్‌ కారణంగా దాదాపు 10 మందిలో ఐదుగురు కచ్చితంగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని అతిగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అధిక వాల్యూమ్‌తో ఎక్కువ సేపు వింటే వినికిడి దెబ్బతినే అవకాశం ఉందని, శాశ్వతంగా చెవులు వినిబడవని తెలిపారు. అందుకే చెవులకు విశ్రాంతి ఇచ్చేందుకు కాసేపు బ్రేక్ ఇవ్వాలని సూచించారు.


ఇక ఇయర్ కెనాల్‌కు దగ్గరగా ఉండటం మూలంగా చెవి ఇన్‌ఫెక్షన్స్ ప్రమాదం పెరుగుతుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అందుకే ఇతరులు యూజ్ చేసిన డివైజ్ శుభ్రం చేయకుండా వాడకూడదని, తడి గుడ్డతో తుడిచాకే వాటిని వినియోగించాలన్నారు. లేదంటే త్వరగా ఇన్‌ఫెక్ట్ అయ్యే చాన్స్‌ ఉందని తెలిపారు. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రోడ్లు దాటేటప్పుడు ఇయర్‌బడ్స్ వినియోగిస్తే చుట్టుపక్కల శబ్దాలు వినకుండా నిరోధించే అవకాశం ఉంటుంది, కనుక రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా కొందరు యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఉదహరించారు.

Also Read...

మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా? 

Tags:    

Similar News