ఆ బీచ్‌లలో నగ్నంగా తిరుగుతున్న పర్యాటకులు.. చూడటానికి క్యూ కడుతున్న జనం
అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొంగ్రొత్త సమాచారాలు వింతగొల్పుతుంటాయి. అలాంటి వాటిలో పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొంగ్రొత్త సమాచారాలు వింతగొల్పుతుంటాయి. అలాంటి వాటిలో పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. టూరిస్టులను బాగా ఆకట్టుకోవడంలో మన దేశంతోపాటు విదేశాల్లోని కొన్ని బీచ్‌లు ముందు వరుసలో ఉన్నాయి. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. చాలా చోట్ల ఇదంతా సాధారణమే. కానీ కొన్నిచోట్ల మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అక్కడి బీచ్‌లలో చాలామంది నగ్నంగా తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటే.. మరి కొందరు వారి నగ్న విహారాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతకీ ఆ అద్భుతమైన బీచ్‌లు ఎక్కడున్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
వాలాల్టా బీచ్..
ప్రపంచంలో ఎంతోమంది ఆకట్టుకుంటున్న నగ్న బీచ్‌లలో వాలాల్టా బీచ్ ఒకటి. క్రొయేషియాలోని ఈ బీచ్ ఎంతో నీట్‌గా, చూడముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వెల్వెట్ ఇసుకకు, పచ్చని చెట్లకు ప్రసిద్ధి. యూరప్ దేశాలతో పాటు ప్రపంచంలోని నలు మూలల నుంచి పర్యాటకులు ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి వస్తుంటారు. అయితే ఇక్కడ స్త్రీ, పురుషులు ఎవరైనా సరే పూర్తి నగ్నంగా బీచ్‌లో విహరించవచ్చు. కట్టు దిట్టమైన భద్రత కూడా ఉంటుంది. ఇటువంటి దృశ్యాన్ని చూడటానికి జనాలు క్యూ కడుతుంటారు.
లూకాట్..
అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అనే క్యూరియా సిటీని పెంచే నగ్న బీచ్‌లలో లూకాట్ బీచ్ ఒకటి. ఇది ఫ్రాన్స్ దేశంలో, మధ్యధరా సముద్రానికి చేరువలో ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్లిన వారు ఎవరైనా నగ్నంగా విహరించవచ్చు. అక్కడి ప్రకృతి దృశ్యాలను అన్ లిమిటెడ్‌గా తిలకించవచ్చు.
బెలెవ్యూ ..
ప్రపంచలోని అత్యంత ఆకర్షణీయమైన బీచ్‌లలో బెలెవ్యూ బీచ్ ఒకటి. ఇది డెన్మార్క్‌లో ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులందరూ దాదాపు నగ్నంగా విహరించడానికి ఇష్ట పడతారట. అందుకే ఇక్కడి ప్రభుత్వం బీచ్ తీరాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. స్త్రీ, పురుషులు నగ్నంగా తిరుగుతున్నందుకు ఏవైనా అనుకోని సంఘటనలు జరుగుతాయనే సందేహాలు, భయాలు కూడా అవసరం లేదట. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పర్యాటకులను సేఫ్‌గా చూసుకోవడంలో ఇక్కడి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.
కార్నిగలియా..
అందమైన, ఆకర్షణీయమైన బీచ్‌లలో మరొకటి కార్నిగలియా బీచ్. ఇటలీలో ప్రసిద్ధి చెందిన పురాతన బీచ్ ఇది. ఇక్కడికి చేరుకోడం కూడా ఒక వింతైన అనుభూతిని ఇస్తుందట. ఎందుకంటే ఇక్కడికి సొరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది మహిళలు టాప్ లెస్‌గా సన్‌బాత్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు పురుషులు కూడా పూర్తి నగ్నంగా విహరిస్తుంటారు. ఎవరివల్ల ఎవరికీ సమస్య ఉండదు. భద్రత విషయంలో భయం అస్సలు ఉండదు. అందుకే ప్రపంచంలోని నలు మూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
కేప్ డి ఎగ్డే బీచ్
ఫ్రాన్స్‌లో గల క్యాప్ డిఎగ్డే బీచ్ ప్రపచంలోనే ఫేమస్. దీనిని న్యూడ్ బీచ్ అని కూడా పిలుస్తారు. విషయం ఏంటంటే.. ఈ బీచ్‌కి వెళ్లేవారు కచ్చితంగా నగ్నంగానే వెళ్లాలట. లేకుంటే లోపలికి అనుమతించరు. ఇక్కడ తిరిగేటప్పుడు, నీటిలో స్నానం చేసేటప్పుడు కూడా నగ్నంగానే ఉండాలి. ఎవరైనా బట్టలు ధరిస్తే భద్రతా సిబ్బంది అడ్డుకుంటుంది. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టే బీచ్ అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు క్యూ కడుతుంటారని ఇక్కడి పర్యాటకశాఖ అధికారులు చెప్తుంటారు.