Science : ఔషధాలను కనుగొనే ముందు ఎలుకలపైనే ప్రయోగాలు ఎక్కువగా ఎందుకని చేస్తుంటారు?

Science : ఔషధాలను కనుగొనే ముందు ఎలుకలపైనే ప్రయోగాలు ఎక్కువగా ఎందుకని చేస్తుంటారు?

Update: 2024-11-12 15:08 GMT

దిశ, ఫీచర్స్ : సైంటిస్టులు మానవ శ్రేయస్సుకోసం ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు కొనసాగిస్తుంటారు. అయితే వారు మనుషులకోసం ఏదైనా ఔషధాన్ని కనుగొని పరీక్షించాలనుకున్నప్పుడు మొదట ల్యాబ్‌లో ఎలుకలపై ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. కాగా ఎన్నో జీవులు ఉండగా శాస్త్రవేత్తలు ఎక్కువగా ఎలుకలపైనే ప్రయోగాలు ఎందుకు చేస్తుంటారనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. అందుకు ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం.

ఔషధాల ట్రయల్స్‌ను మానవులపై కాకుండా ఎలుకలపైనే పరీక్షించడానికి ప్రత్యేకించి కొన్ని కారణాలు ఉన్నాయి. మనుషులు, ఎలుకలకు మధ్య జీవశాస్త్రపరంగా ఎటువంటి సారూప్యత లేకపోయినప్పటికీ, ప్రయోగశాలలో పెంచిన ఎలుకలు, మనుషుల మధ్య మాత్రం జన్యుపరమైన విషయాలలో కొన్ని పోలికలు ఉంటాయని అమెరికాస్ ఫౌండేషన్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎబిసి 10 వెబ్ సైట్) పేర్కొంటున్నది. దీని ప్రకారం.. 95 శాతం ప్రయోగశాల జంతువులు, ముఖ్యంగా ఎలుకలను అవసరమైనప్పుడు పరిశోధనలు, ప్రయోగాలు చేసేందుకే మాత్రమే పెంచుతారు. అందుకే మెడికల్ ట్రయల్స్‌లో ఉపయోగించే చాలా ఎలుకలు ఇన్‌బ్రేడ్‌గా ఉంటాయని, వాటి జన్యు పరమైన అంశాలు, జీవ ప్రక్రియలో ప్రవర్తనలు మానవులకు దగ్గరిగా ఉంటాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే మానవులకు ఔషధాలు కనుగొనే ఎక్కువ శాతం ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు ఎలుకలనే ఎంపిక చేసుకుంటారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News