Fashion : పాతవే కొత్తగా.. మోడ్రన్ స్టైల్లో బనారసీ!

Fashion : పాతవే కొత్తగా.. మోడ్రన్ స్టైల్లో బనారసీ!

Update: 2024-11-21 14:41 GMT

దిశ, ఫీచర్స్ : బనారసీ చీరలైనా, కుర్తాలైనా ఎక్కువగా పెళ్లిళ్లు, వివిధ ఫంక్షన్ల సందర్భంగా ధరిస్తుంటారు చాలా మంది. ఒక విధంగా చెప్పాలంటే వీటిని సంప్రదాయ దుస్తులుగా పేర్కొంటారు. ఒకప్పుడు మిడిల్ ఏజ్, ఆ తర్వాత వయస్సు గల వాళ్లు ధరించే అలానాటి స్టైల్‌గా పరిగణించేవారు. కానీ ఇప్పుడలా కాదు. కాలం మారింది. బనారసీ అంటే అమ్మలు, అమ్మమ్మలు ధరించేవి మాత్రమే కాదు, ఆధునిక మగువల అందాన్ని పెంచుతున్న మోడ్రన్ డిజైన్లుగానూ అవతరించాయి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.

ఈతరం యువతీ యువకులు కూడా బనారసీ లేదా పట్టు వస్త్రాలను ఆయా డిజైన్లలో తయారు చేసినవి ధరించడం ట్రెండీగా, సరికొత్త ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. ఒకప్పుడు బంగారు జరీ చీరలు, దుపట్టాలు, కుర్తాల రూపంలో కనువిందు చేసినా బనారసీ వస్త్రాలు, నేడు కుర్తాలు, సఫాలు, బంధ్ గలాలు, షేర్వానీలు వంటి అందమైన డిజైన్లలోనూ అలరిస్తున్నాయి. కొందరు వీటిని స్కర్టులుగా, స్ట్రాప్ లెస్ గౌన్లుగా కూడా వేసుకుంటున్నారు. ఆ మధ్య అందరినీ అలంరించిన వరల్డ్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ పలువురు మోడల్స్ ఆధునిక బనారసీ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. కామన్ పీపుల్, ముఖ్యంగా మోడ్రన్ అమ్మాయిలు ఈ మధ్య బనారసీ జంప్ సూట్లు, ట్రౌజర్లు, కోర్సెట్, టాప్స్, బ్రొకేడ్ ప్యాంట్లు, మాక్సీలు, షార్ట్ స్కర్టులను ధరిస్తున్నారు. ఒకప్పటి పాత ఫ్యాషన్ అనుకున్న బనారసీ.. ఇప్పుడు ఆధునిక హంగులతో అందరినీ అలరిస్తోంది. 

Tags:    

Similar News