కారం ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలా..? ఏం జరుగుతుందో చూడండి !

కారం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Update: 2024-11-18 08:41 GMT

దిశ, ఫీచర్స్: కారం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉంటుంది. ఆహారంలో ఉప్పు, కారం సరిగా ఉంటేనే కూర రుచిగా ఉంటుంది. కానీ, కొందరు కారం ఎక్కువగా తింటుంటారు. అయితే, ఎక్కువగా కారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కారం ఎక్కువగా తింటే ఉప్పు కూడా ఎక్కువగా తినాల్సి వస్తుంది. దీని వల్ల అజీర్తి సమస్యలతో పాటుగా ప్రేగు సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. కొందరు ప్రతీ రోజు స్పైసీ ఫుడ్‌ను ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అధిక బీపీ ఉన్న వారు కారం, మసాలాలను తగ్గించి, ఆహారం తినడం మంచిది.

అల్సర్: కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. సాధారణంగా వైద్యులు కారాన్ని తక్కువగా తినమని చెబుతుంటారు. కారం ఎక్కువగా తింటే అల్సర్‌ వచ్చే చాన్స్ ఉంది. దీంతోపాటు గ్యాస్, కడుపులో మంట, పుండ్లు కూడా ఏర్పడతాయి. కారంతో పాటుగా మసాలాలు కూడా ఎక్కువగా తినడం మంచిది కాదు. దీని వల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయి.

డయేరియా: ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కడుపు దెబ్బతింటుంది. ఇది పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది.

చర్మ సమస్య: ప్రతి రోజూ తినే ఆహారంలో ఎక్కువగా కారం తీసుకోవడం వల్ల చర్మంలోని తేమ తగ్గి, పొడిబారడంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా వేసిన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండడమే.

కారంతో పాటుగా మసాలాలను ప్రతీ రోజు ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రోజువారి ఆహారంలో మసాలాలు, కారం తగినంతగా వేసుకోవడం మంచిది.


Tags:    

Similar News