స్కిన్లెస్ చికెన్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?
పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.
దిశ, ఫీచర్స్: పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. పట్టణాల్లో సండే వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ కోసం షాక్‌కు వెళ్లినప్పుడు 90 శాతం మంది కచ్చితంగా స్కిన్ లెస్ చికెన్ ఇవ్వమని అడుగుతారు. దుకాణాదారుడు కూడా విత్ స్కిన్ కావాలా? లేక స్కిన్ లెస్ కావాలా? అని అడుగుతారు.
చికెన్ స్కిన్ తింటే కొవ్వు, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చికెన్ స్కిన్ తినరు. అయితే ఇలాంటి వారి కోసం తాజాగా నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. చికెన్ చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ లిమిట్లో తినాలి. పూర్తిగా మాంసం తింటే అంతగా రుచి కూడా ఉండదు. కాబట్టి తోలుతో తింటే టేస్ట్‌తో పాటు హెల్త్‌కు కూడా చాలా మంచిందంటున్నారు నిపుణులు.
కొవ్వు విషయానికొస్తే.. ఒక ఔన్స్ చికెన్ స్కిన్‌లో కేవలం 8 గ్రాముల అసంతృప్త కొవ్వు, 3 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. చర్మాన్ని పరీక్షించిన నిపుణులు అందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు (లేదా ఒలీక్ యాసిడ్) ఉన్నట్లు గుర్తించారు. ఈ యాసిడ్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంటే మనం ఇప్పటివరకు భయపడినట్లుగా ఇది కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచదు.. తగ్గిస్తుంది.
ఇది శరీరంలోని హార్మోన్ల పరిమాణాన్ని కూడా నియంత్రించడంతో ఎంతో సహాయపడుతుంది. స్కిన్ లెస్ అయితే నూనె ఎక్కవగా వాడాల్సి వస్తుంది. స్కిన్‌తో ఉన్న మాంసం తక్కువ ఆయిల్‌ను తీసుకుంటుంది. అలాగే చికెన్ స్కిన్ లేని మాంసంలో కేలరీలలో పెద్దగా ఏం తేడా ఉండదు.