GREENS: వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదంలో పడ్డట్లే
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
దిశ, ఫీచర్స్: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని నివారిస్తుంది. డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ వంటి వివిధ వ్యాధులను నివారించడంలో ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటి చూపు మెరుగుపడుతుంది.
వీటిలో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తినడం వల్ల శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతుంది. మెంతికూర వంటి పలు ఆకుకూరలు మూత్రంలోని రాళ్లను కరిగిస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్న వీటిని వర్షాకాలంలో తీసుకోకపోవడం బెటర్ అని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే..
వానాకాలంలో ఆకుకూరలు బురదగా ఉంటాయి. దీంతో ఆకులపై గాలిలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్ ఆకులపై చేరుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. డయోరియా వంటి ప్రేగు సంబంధింత రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ వర్షాకాలంలో ఆకుకూరలు తినాలనుకున్నవారు ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించండి.. ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే ఆకును ఒక్కోక్కటిగా ఓపికగా కడగండి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని దానిపై ఆరబెట్టండి. అలాగే కూర చేసే ముందు హాట్ వాటర్‌లో సాల్ట్ వేసి.. అందులో ఆకుకూర వేసి 30 సెకన్లు ఉంచి తీయండి. దీంతో ఎలాంటి రోగాలు దరిచేరవు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా అందించబడింది. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దీనిని దిశ ధృవీకరించలేదు