Fish: చేపలను తినడం వలన ఈ వ్యాధులను తరిమికొట్టచ్చు!
చాలా మందికి ఇష్టమైన మాంసహారాలలో సీ ఫుడ్ కూడా ఒకటి.
దిశ, వెబ్ డెస్క్ : చాలా మందికి ఇష్టమైన మాంసహారాలలో సీ ఫుడ్ కూడా ఒకటి. వాటిలో రొయ్యలు, పీతలు ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికి అందరికీ ఇష్టమైనవి చేపలు మాత్రమే. వీటిని తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి కొంత మందికి తెలియదు. చేపలలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. దాని వల్ల కండరాలు పుష్టిగా తయారవుతాయి. ఇంకా చెప్పాలంటే వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ తో పాటు విటమిన్ డి వంటి పోషకాలు కూడా ఉంటాయి.కొంత మందికి పడుకున్నా కూడా నిద్ర పట్టదు. అలాంటి వారు వారంలో రెండు సార్లు తింటే నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. డిప్రెషన్‌తో బాధ పడే వారికీ కూడా ఇవి సహాయపడతాయి.
Also Read..