షుగర్ పేషెంట్లు టీ తాగడం సురక్షితమేనా?

పాలు, చక్కెరతో తయారు చేసిన టీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో వేగంగా గ్లూకోజ్ స్థాయిల పెరుగుదలకు కారణం అవుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు చాయ్ కి దూరంగా ఉండటం

Update: 2024-06-22 13:15 GMT

దిశ, ఫీచర్స్ :  పాలు, చక్కెరతో తయారు చేసిన టీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో వేగంగా గ్లూకోజ్ స్థాయిల పెరుగుదలకు కారణం అవుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు చాయ్ కి దూరంగా ఉండటం లేదా పరిమితం చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు. లేదంటే పాలు, షుగర్ కు ప్రత్యామ్నాయాలు ఎంచుకోమని సూచిస్తున్నారు. అవి చక్కెర స్థాయిలపై ఎఫెక్ట్ చూపకుండా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. మరి అవి ఏంటి? ఏం చేయాలి? తెలుసుకుందాం.

* చక్కెర అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీని వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ వెంటనే పెరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

* మనం ఎంచుకునే పాలు కీలకం. ఆవు లేదా గేదె పాలు ఎక్కువ కొవ్వు, కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి తక్కువ కేలరీలు కలిగిన స్కిమ్డ్ లేదా మొక్కల ఆధారిత పాలను వినియోగించడం మంచిది. ఇవి షుగర్ లెవల్స్ పై తక్కువ ఎఫెక్ట్ చూపుతాయి.

* పాలు, షుగర్ తో చేసిన టీ అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. దీంతో డయాబెటిస్ కంట్రోల్ చేయడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.

* ఆర్టిఫీషియల్ స్వీటేనర్స్, స్టేవియా వంటి సహజ ప్రత్యామ్నాయాలను పరిగణలోకి తీసుకోండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.

* లేదంటే టీ తీసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు.. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి. అంటే ఇతర భోజనంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల షుగర్ పేషంట్స్ కు ఎక్కువ ఇబ్బంది ఉండకపోవచ్చు.


Similar News