Blue Tea: డయాబెటిస్ బాధితులు బ్లూ టీ తాగవచ్చా?
బ్లాక్ టీ, గ్రీన్ టీల మాదిరే ప్రస్తుతం బ్లూ టీ కూడా అందుబాటులోకి వచ్చింది
దిశ, ఫీచర్స్ : బ్లాక్ టీ, గ్రీన్ టీల మాదిరే ప్రస్తుతం బ్లూ టీ కూడా అందుబాటులోకి వచ్చింది. రోజూ టీ తాగితే కానీ పొద్దు గడవదనుకునేవారు చాలామంది ఉంటారు. రకరకాల టీలను రుచి చూడాలని కోరుకుంటారు. ఇక ఆరోగ్యానికి మంచిదని తెలిస్తే అస్సలు వదలరు. గ్రీన్ టీ అందుబాటులోకి వచ్చాక చాలామంది దానివైపు మొగ్గారు. ప్రస్తుతం బ్లూ టీ కూడా అందుబాటులోకి వచ్చాక పలువురు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తాగొచ్చా.. లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే షుగర్ పేషెంట్లు నిస్సందేహంగా తాగవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఉదయం లేవగానే బ్లూటీ ఒక కప్పు తాగటం ఆరోగ్యానికి మంచిదట. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ టీలో కొద్దిపాటి నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే మరింత మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు. బ్లూ టీ ఎలా తయారు చేసుకోవాలన్న సందేహం కూడా అవసరం లేదు. ఇతర టీ పొడుల్లాగే, మార్కెట్లో బ్లూటీ తయారు చేసుకోవడానికి అవసరమైన బటర్ ఫ్లై పీ పౌడర్ లభిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు బ్లూటీ తాగడంవల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించబడతాయి. ఇందులో ఉండే ఎసిటైల్ కోలిన్ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి నివారణకు దోహద పడుతుంది. మెదడు పనితీరులో చురుకుదనం పెంచుతుంది. చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించే గుణం బ్లూ టీకి ఉంది.
ఇవి కూడా చదవండి: