మీకు ఇలాంటి కలలు వచ్చాయా.. ష్.. ఎవరికీ చెప్పకూడదంట!

లలు రావడం అనేది చాలా సహజం. కొందరు రాత్రి సమయంలో ఎక్కువ కలలు కంటే, మరికొందరు మధ్యాహ్నం సమయంలో కలలు కంటూ ఉంటారు. అయితే కలలు అనేవి ఎవరికి ఎలా

Update: 2023-02-23 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కలలు రావడం అనేది చాలా సహజం. కొందరు రాత్రి సమయంలో ఎక్కువ కలలు కంటే, మరికొందరు మధ్యాహ్నం సమయంలో కలలు కంటూ ఉంటారు. అయితే కలలు అనేవి ఎవరికి ఎలా వస్తాయో ఎవ్వరం చెప్పలేం.

కొందరికి కలలో పక్షులు, జంతువులు, మొక్కలు కనిపిస్తే, మరికొందరికి పూర్వీకులు, నగలు, దగ్గరి బంధువులు కనిపిస్తుంటారు. అయితే చాలా మంది తమకు వచ్చిన కలలను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొన్ని కలలు అస్సలే షేర్ చేసుకోకూడదు అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. అయితే అసలు ఎలాంటి కలలు ఇతరులతో పంచుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

చాలా మందికి తమకు తామే చనిపోయినట్టు కల వస్తుంది.అయితే అలాంటి కలలు శుభ సూచకం అంట, ఆ కలను ఎవరితోనైనా పంచుకుంటే ఆ ఆనందాన్ని అందుకోలేరు అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.

అలాగే గర్బిణిలకు కలలో పండ్లతోటలు కనిపిస్తుంటాయి. కలలో పండ్లతోటలు కనిపిస్తే అబ్బాయి, పూలతోటలు కనిపిస్తే అమ్మాయి పుడుతది అంటారు. అందువలన ఇలాంటి కలలను కూడా ఎవరితో పంచుకోకూడదంట.

కొంత మందికి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్లు కలవస్తుంది. మరికొదరికి కలలో వెండి కలశం లాంటివి కనిపిస్తాయి. అయితే ఈ కలలు కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదంట. ఒక వేళ షేర్ చేసుకుంటే ఆ ఫలితాలను పొందలేరు అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.

ఇవి కూడా చదవండి:

ఎముకలు.. దంతాల బలోపేతానికి ఈ ఆహారాలు తీసుకోండి!  

Tags:    

Similar News