ఎనర్జీని పెంచే డ్రాగన్ ఫ్రూట్.. వారానికి ఒక్కటి తిన్నా ఆ సమస్యలన్నీ పరార్!

డ్రాగన్ ఫ్రూట్.. మార్కెట్లో ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉండే పండు ఇది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. త్వరగా శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.

Update: 2024-07-13 11:29 GMT

దిశ, ఫీచర్స్ : డ్రాగన్ ఫ్రూట్.. మార్కెట్లో ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉండే పండు ఇది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. త్వరగా శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. వర్షాకాలంలో తినడంవల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రస్తుతం చాలామంది ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీని పెంచే డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు.

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను పెంచుతుంది. విటమిన్ B2 (రిబోఫ్లావిన్) కూడా కలిగి ఉన్నందున మొత్తం శరీరానికికే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పొటాషియం ఫుల్లుగా ఉండటంవల్ల రక్తపోటును నియంత్రించడంలో, మెరుగైన గుండె పనితీరుకు దోహదం చేస్తుంది. ఫైబర్ కంటెంట్ ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలం డ్రాగన్ ఫ్రూట్. కాబట్టి ఇది రక్త కణాల డ్యామేజ్‌ను, శరీరంలో నొప్పిని, డీహైడ్రేషన్ వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. మెగ్నీషియం కంటెంట్ కలిగి ఉన్నందున కండరాలు, నరాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి హెల్తీ డైట్‌లో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కటి తిన్నా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. 


Similar News