కోడి కూస్తుందని ఫిర్యాదు చేసిన డాక్టర్ మోడీ.. అసలు కారణం ఏమిటంటే?
అప్పట్లో ప్రజలు కోడికూతతోనే ఉదయం నిద్రలేస్తు్ండేవారు. ఇప్పటికి పలు ప్రాంతాల్లో ఈ విధమైన పద్ధతులను పాటించేవారు ఉన్నారు. ఇప్పడు ఈ కోడికూతే
దిశ, డైనమిక్ బ్యూరో : అప్పట్లో ప్రజలు కోడికూతతోనే ఉదయం నిద్రలేస్తు్ండేవారు. ఇప్పటికి పలు ప్రాంతాల్లో ఈ విధమైన పద్ధతులను పాటించేవారు ఉన్నారు. ఇప్పడు ఈ కోడికూతే నిద్రను పాడు చేస్తుందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పొద్దున్నే కోడికూతతో నిద్ర లేవాల్సిన ఓ వ్యక్తి.. కోడికూసి నిద్ర లేకుండా చేస్తుందని పొరుగువారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన డాక్టర్ అలోక్ మోడీ పక్కింట్లో ఉదయాన్నే కోడికూత కూస్తుంటుంది. అయితే, రాత్రి లేటుగా పడుకునే మోడీకి.. ఉదయం 5 గంటలకు కోడికూతసి నిద్ర పాడు చేస్తుందని..దీంతో, నిద్ర సరిపోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కోడి యజమానికి అనేక సార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయినా వారు వినిపించుకోకపోవడంతో విసుగు చెందిన మోడీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. పలాసియా పోలీస్‌స్టేషన్‌లో కోడికూసి తన నిద్రపాడు చేస్తు్ందని ఫిర్యాదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ బైన్స్ తెలిపారు. దీంతో, ఇరువురిని విచారించిన అధికారి సమస్యను పరిష్కరించుకునే మార్గం చూపుతామని..అయినా సమస్య కొనసాగితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)సెక్షన్ 133 కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, కోడికూసి నిద్రపాడు చేస్తుందని పీఎస్‌లో చేసిన ఈ ఫిర్యాదు నెట్టింట వైరల్ అవుతుంది.
READ MORE
నీటిలో మైక్రో ప్లాస్టిక్ శుద్ధికి పౌడర్.. గంటలో మురుగునీరు క్లీన్..