Kitchen: కిచెన్ లో ఈ పనులు చేస్తే దరిద్రమంట.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

పెళ్లయ్యాక భార్యాభర్తలు చేదోడు వాదోడుగా ఉంటారు.

Update: 2024-03-05 02:57 GMT

దిశ, ఫీచర్స్: పెళ్లయ్యాక భార్యాభర్తలు చేదోడు వాదోడుగా ఉంటారు. కొంతమంది తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కౌగిలించుకోవాలని అనుకుంటారు. దీంతో వంటగదిలో వంట చేస్తూ తమ భార్య దగ్గరికి వెళ్లి పని చేయనివ్వకుండా రొమాన్స్ చేస్తుంటారు. అయితే దీని వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వంటగదిలో మనకి అవసరమైన ఆహారాలను తయారు చేసుకుంటాము. అలాంటి సమయంలో విసిగిస్తే వంటలు కూడా సరిగా రావు. ఇది లక్ష్మీ దేవి స్థానం కాబట్టి, అక్కడ రోమాన్స్ చేసుకుంటూ విచ్చల విడిగా ప్రవర్తించకూడదంటారు.

కొన్నిసార్లు ఇలా చేసేటప్పుడు.. చీరనో లేక డ్రెస్ గ్యాస్ స్టౌవ్ కు తగిలి లేని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే, కొన్నిసార్లు గ్యాస్ స్టౌవ్ మీద పెట్టిన ఐటమ్స్‌ మర్చిపోయి, చివరకు అవి మాడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతుంటారు. కొందరు గ్యాస్ స్టౌవ్ క్లీన్ చేయడానికి పాత బనీయన్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మంచి ఆలోచనతో ఆహారాన్ని తయారుచేస్తే, అది తినేవావారికి అలాంటి ధోరణే ఉంటుందని అంటుంటారు. అందుకే వండేటప్పుడుఎంతో జాగ్రత్తగా, కూల్ మైండ్ తో వంట చేస్తే అది చేసిన వారికి, తిన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అరుగుతుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 

Read More..

వాస్తు ప్రకారం చీపురు ఈ దిశలో అసలు పెట్టకూడదు.. ఇలా పెడితే అష్టదరిద్రం తప్పదు  


Similar News