బ్రా ధరించడం వల్ల ఆ సమస్య వస్తుందా? .. దీనిలో వాస్తమెంత?
క్యాన్సర్ నిజానికి అనేక రూపాల్లో వస్తుంది.
దిశ, ఫీచర్స్: క్యాన్సర్ నిజానికి అనేక రూపాల్లో వస్తుంది. ఈ క్యాన్సర్లలో, రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత ప్రాణాంతకమైనది. రొమ్ము క్యాన్సర్ గురించి అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో ఇక్కడ తెలుసుకుందాం.
కొన్ని విషయాలు స్త్రీ జీవితంలో అంతర్భాగంగా ఉంటాయి. వాటిలో బ్రా చాలా ముఖ్యమైనది. కొంతమంది దీనిని 24 గంటలూ ధరిస్తారు. కొంతమంది ఇంటికి రాగానే తీసేస్తారు. మరి కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు కూడా బ్రా వేసుకుంటారు. రాత్రి పడుకునేటప్పుడు బ్రా ధరించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట బ్రా ధరించడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం?
నిద్రపోతున్నప్పుడు బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రొమ్ము దగ్గర నొప్పి ఎక్కువగా ఉంటే.. అది బ్రెస్ట్ కేన్సర్ ప్రధాన లక్షణం. ఈ లక్షణం కనిపించినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. రాంగ్ సైజ్ బ్రా సైజ్ ధరించడం వల్ల వాపు, ఆకార మార్పులు, భంగిమ మార్పులు, వెన్నునొప్పి, చర్మ పరిస్థితులకు కారణం కావచ్చు. స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. అంతే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఛాతీలో రక్త ప్రసరణ నిరోధించబడవచ్చు. అంటే బ్రా వేసుకోవడం వల్ల కానీ బ్రాతో పడుకోవడం వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనేది నిజం కాదు.