శ్వాస తీసుకుంటే ఛాతి నొప్పి వస్తుందా..? అయితే, ఈ సమస్య ఉన్నట్లే..!
గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఛాతి నొప్పి వస్తుందని చాలా మంది అనుకుంటారు.
దిశ, ఫీచర్స్: గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఛాతి నొప్పి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ రోజుల్లో చిన్న ఛాతి నొప్పిని కూడా సాధారణ నొప్పిగా భావించకండి. కొన్నిసార్లు అది గుండెపోటుకు ప్రమాదం కావచ్చు. సాధారణంగా శ్వాస సమస్యలతో సంబంధం కలిగి ఉంటే, అది గుండె సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. ఇలాంటి సమస్య తరచుగా వస్తుంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ఊపిరితిత్తులు అనారోగ్యాన్ని సూచిస్తాయి. తరచుగా తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకునే సమయంలో దగ్గు వస్తే అది ఊపిరితిత్తుల సమస్యకు కారణం అవుతుంది.
ఫ్లూరిసీ: దీర్ఘశ్వాస తీసుకుంటున్నప్పుడు సమస్యగా ఉందంటే దానికి కారణం ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొర వాపుకు గురైందని అర్థం. దీని వల్ల తరుచుగా దగ్గు, ఛాతిలో తీవ్రమైన మంట కలుగుతుంది.
ఊపిరాడకపోవడం: మెట్లు ఎక్కే సమయంలో లేదా ట్రెక్కింగ్‌కు వెళ్లేటప్పుడు బాగా ఆయాసపడడం, ఊపిరి ఆడకపోవడం వంటివి లంగ్స్‌లో సమస్యలకు సంకేతం కావచ్చు. పల్మనరీ హైపర్‌టెన్షన్, ఆస్తమా కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.
ఆకస్మాత్తుగా బరువు తగ్గడం: వ్యాయమం, డైటింగ్ చేయకుండానే బరువు తగ్గుతున్నట్లైతే అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుసుకోవాలి.
దీర్ఘకాలిక ఛాతి నొప్పి: దీర్ఘకాలిక ఛాతి నొప్పి గుండెలో మార్పుల వల్ల సంభవిస్తుంది. అయితే, ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. దగ్గినప్పుడు లేదా దీర్ఘ శ్వాస తీసుకుంటున్నప్పుడు నొప్పి వస్తే, అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం అవుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.