ప్రేమలో పడగానే ఆకలి, దాహం, నిద్ర నిజంగా తగ్గుతాయా..?

ప్రేమ ఎందుకు పుడుతుంది అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా.. ప్రేమలో పడితే ఆకలి, దాహం లేకపోవడం, నిద్ర పోకపోవడం ఇవన్నీ ప్రేమ గురించిన కవితల్లో, కథల్లో చదివే ఉంటాం.

Update: 2024-09-06 02:49 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ప్రేమ ఎందుకు పుడుతుంది అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా.. ప్రేమలో పడితే ఆకలి, దాహం లేకపోవడం, నిద్ర పోకపోవడం ఇవన్నీ ప్రేమ గురించిన కవితల్లో, కథల్లో చదివే ఉంటాం. ప్రేమలో ఉన్నప్పుడు ఆకలి, దాహం, నిద్ర తగ్గిపోతాయన్నది నిజమేనా ? దీని గురించి సైన్స్ ఏమి చెబుతుంది ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2012లో 'సైకోఫార్మకాలజీ'లో ప్రేమకు సంబంధించిన మానసిక, సామాజిక, రసాయన కారణాలన్నింటినీ వివరించి కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు కానీ, అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు కానీ ప్రేమించాలా లేదా అని నిర్ణయించుకోవడానికి 90 సెకన్ల నుంచి 4 నిమిషాల సమయం తీసుకుంటారట.

ప్రేమలో పడబోతున్నప్పుడు ఈ మూడు విషయాలు ముఖ్యమైనవట..

1. ఒక వ్యక్తి ప్రేమలో పడేందుకు ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ 55% పాత్ర పోషిస్తుందట. ఎదుటి వ్యక్తి వ్యక్తీకరణలను చూసి మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తామా లేదా అని నిర్ణయించుకోవడానికి మన మనస్సు ప్రయత్నిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

2. ఇక రెండోది వ్యక్తి స్వరం 38% పాత్ర పోషిస్తుందట.

3. అవతలి వ్యక్తి అనుసరిస్తున్న విషయాలు 7% పాత్ర పోషిస్తుందట.

ఒక వ్యక్తితో ప్రేమలో పడినప్పుడు ఆ వ్యక్తిని కలిసిన వెంటనే హృదయ స్పందనలు పెరుగుతాయి. వారిది సాధారణ స్వరం అయినా కూడా వారి ప్రియమైన వారికి సంగీతంలా అనిపిస్తుందట. ప్రేమించిన వారితో జీవిస్తున్నప్పుడు జీవితం మరింత అర్థవంతంగా అనిపిస్తుందంటున్నారు. అయితే ప్రేమ అనేది చాలా సంక్లిష్టమైన అనుభూతి, ప్రేమలో కోరికలు కూడా ఉంటాయి. ప్రేమించిన వారు కనిపించకపోతే ఆత్రుత పెరుగుతుంది. వారు మరొకరితో కనిపిస్తే అసూయ, కోసం వస్తుంటుంది. అయితే ఇదంతా హృదయాలు చేసే పనికాదట.. అది వారి మెదడులోని హార్మోన్ల ఆడించే ఆట అంటున్నారు పరిశోధకులు.

ప్రేమలో పడటానికి 3 దశలు..

ఇటీవలి జరిగిన పరిశోధనలో ప్రేమలో పడటానికి ఈ 3 దశలు ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మూడు దశల్లో మన శరీరంలో వివిధ రకాల హార్మోన్లు విడుదలవుతాయని చెబుతున్నారు. అవి ఏంటంటే.

1. కామం : మొదటి చూపులో ప్రేమ పుట్టిన తర్వాత ప్రారంభంలో ఒకరి పై ఒకరికి లైంగిక ఆకర్షణ కూడా కలుగుతుంది. చాలా వరకు, శారీరక ఆకర్షణ కారణంగానే ప్రేమ ప్రారంభమవుతుందంటున్నారు పరిశోధకులు. అందుకే ఈ దశల్లో స్త్రీ పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్లు విడుదలవుతాయట. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి సంకేతం అంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ల విడుదల శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుందట. ఆయుష్షును పెంచడంలో కూడా సహాయపడుతుందంటున్నారు పరిశోధకులు.

2. ఆకర్షణ : ఇది ప్రేమలో పడే అత్యంత అందమైన దశ అంటున్నారు పరిశోధకులు. మీరు మీ భాగస్వామి పట్ల ఆకర్షితులు కావడం ప్రారంభం అయినప్పుడు అది మీ స్వభావం, జీవనశైలి, తినడం, తాగడం, నిద్రపోవడంలో కూడా మార్పులు తీసుకువస్తుందట.

ఒక పరిశోధనలో కొత్త జంట మెదడును MRI చేసినప్పుడు, చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయట. ఈ జంటల మెదడులో ఆనందం, విశ్రాంతిని అందించే డోపమైన్ అనే హార్మోన్ స్థాయి పెరిగిందంటున్నారు పరిశోధకులు. దీని ఆధారంగా ఈ ఆకర్షణ దశలో మూడు హార్మోన్లు అడ్రినలిన్, డోపమైన్, సెరోటోనిన్ పనిచేస్తాయంటున్నారు.

అడ్రినలిన్ : ప్రేమ ప్రారంభంలో ఒత్తిడిని తగ్గుతుంది. అలాగే పని విధానంలో కూడా మార్పు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రేమ ప్రారంభంలో మన భాగస్వామిని చూడగానే మన హృదయ స్పందన పెరుగుతుంది. మనస్సులో ఒక రాగం వినిపిస్తుందట. వారిని చూసిన వెంటనే ఓ ఆనందం కలుగుతుందట. ఇదంతా ఈ హార్మోన్ అడ్రినలిన్ వల్ల జరుగుతుందట.

డోపమైన్ : ఈ హార్మోన్ ఆనందం, ఉత్సాహాన్ని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ వల్ల ఆకలి మందగించడం, నిద్రతగ్గడం, పనిలో ఏకాగ్రత తక్కువగా ఉండడంతో పాటు ముఖం పై నిత్యం చిరునవ్వు ఉంటుంది.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News