Fast Food: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే ఆ సమస్యలు వస్తాయా?
మనలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టంగా తింటారు.
దిశ, వెబ్ డెస్క్: మనలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టంగా తింటారు. మరి కొందరు ఇంటి నుంచి వెళ్లే దారి మధ్యలో తింటారు. అయితే, ఇది మంచిది కాదని, దీని వలన కిడ్నీలు పాడవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఒకటి కాదు, ఎన్నో రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఫాస్ట్ ఫుడ్ కూడా ఒకటి. ఇది ఎక్కువగా తీసుకునే వారికి ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. కొందరు బయటకు వెళ్లినప్పుడు ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటారు. ఇది ఆరోగ్య ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే సమస్యలేంటో ఇక్కడ చూద్దాం.
1. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వలన అధిక రక్తపోటు ఎక్కువవుతుంది. దీనిలో వాడే పదార్ధాలు అధిక రక్తపోటును పెంచి, కిడ్నీల ఒత్తిడికి గురి చేస్తుంది.
2. దీనిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ కిడ్నీని దెబ్బ తినేలా చేస్తాయి.
3. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం వలన ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా.. తీపి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.
4. దీనిలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బ తినేలా చేస్తుంది.
5. ఫాస్ట్ ఫుడ్ ను రోజు తీసుకోవడం వలన సులభంగా బరువు పెరుగుతారు. మధుమేహం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.