Dark Chocolate: డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా..?

డార్క్ చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

Update: 2024-12-02 13:28 GMT

దిశ, ఫీచర్స్: డార్క్ చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇది రుచిగా ఉండడమే కాదు దీనిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇవి కోకోబీన్స్ నుంచి తయారు చేస్తారు. ఇందులో బటర్, చక్కెర వంటి ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. డాక్క్ చాక్లెట్‌లో కోకో శాతం ఎక్కువగా ఉండడం వల్ల, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ప్లేవనాయిడ్స్ శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో తోడ్పతుంది.

డార్క్ చాక్లెట్లను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ‘ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’లోని అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల గట్ మైక్రోబయోమ్‌లో పెరుగుదలను పెంచుతుందని తెలిపారు. ఇది మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఫెనిలేథైలమైన్ పదార్థాలు మానసిక స్థితిని నియంత్రించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు, ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల 50 శాతం వరకు హార్ట్ స్ట్రోక్‌ను తగ్గింకోవచ్చు. ప్రతీ రోజూ కొద్ది మొత్తంలో వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఇలా తీసుకోండి:

* డార్క్ చాక్లెట్లు అన్నీ ఒకే రకంగా ఉండవు. వీటిని తినే ముందు చక్కెర తక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది. చక్కెర స్థాయిలు తక్కువ ఉన్న వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

* డార్క్ చాక్లెట్లను రాత్రి పూట తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.

* వీటిని కొనే ముందు నాణ్యమైనవా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ చాక్లెట్ కొంచెం చేదుగా ఉండాలి. అలా కాకుండా తియ్యగా అనిపిస్తే అందులో చక్కెర ఎక్కువగా ఉందని అర్థం.

* మధుమేహం ఉన్నవారు డార్క్ చాక్లెట్లు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. చాక్లెట్ తినడం ఆరోగ్యానికి మంచిది కదా అని దీనిని ఎక్కువగా తినకూడదు. రోజులో 30 నుండి 40 గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News