రాత్రి వేళ బీపీ పెరుగుతుందా.. అయితే, వీటి గురించి తెలుసుకోవాల్సిందే!

ఈ మధ్య కాలంలో అధిక రక్తపోటు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది

Update: 2024-03-04 04:18 GMT

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో అధిక రక్తపోటు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. కొన్ని సందర్భాల్లో, నిద్రలో రక్తపోటు కూడా గణనీయంగా పెరుగుతుంది. దీని వల్ల ప్రాణాలు పోతాయా.. లేదనేది ఇక్కడ చూద్దాం..

అధిక రక్తపోటు అనేది ప్రాణాంతక సమస్య. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణం పోతుంది.ఆధునిక జీవన విధానంలో, ఆహారపు అలవాట్లు జీవనశైలి అలవాట్ల వల్ల రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటును క్రమం తప్పకుండా నియంత్రించకపోతే, గుండెపోటు, స్ట్రోక్స్, గుండె జబ్బులు సంభవించవచ్చు. అందుకే అధిక రక్తపోటును " సైలెంట్ కిల్లర్" అంటారు. అధిక రక్తపోటు గుండెపై మాత్రమే కాకుండా మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు మీ ఆహారాన్ని నియంత్రించకపోతే, మీ రక్తపోటు అదుపులో ఉండదు. ముఖ్యంగా జంక్ ఫుడ్ , ప్యాకేజ్డ్ ఫుడ్స్ , వేపుడు పచ్చళ్లకు దూరంగా ఉండాలి. వంట చేసేటప్పుడు ఉప్పు వాడకపోవడమే మంచిది.

కొంతమంది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. తరచుగా మూత్రవిసర్జన అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది, మూత్రవిసర్జన పెరుగుతుంది. కొందరికి రాత్రిపూట నిద్రలేచినప్పుడు , అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు తలనొప్పి వస్తుంది. ఇది అధిక రక్తపోటు వల్ల వచ్చే సమస్య. ఈ సమస్యను తేలికగా ఎందుకంటే అధితీసుకోకండి. రక్తపోటు అనేది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుందో ఎవరికీ తెలియదు.

Read More..

బంగారం కంటే విలువైన బ్రోకలీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే..?  


Similar News