భుజం నొప్పే అని లైట్ తీసుకుంటున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!
ఈ మధ్య కాలంలో ఏ నొప్పి వచ్చినా సరే చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ చివరకు అదే పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా భుజం నొప్పి వస్తే, చిన్నదేగా అని కొట్టిపారేస్తుంటారు.అయితే భుజం నొప్పి వస్తే ఈజీగా
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ఏ నొప్పి వచ్చినా సరే చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ చివరకు అదే పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా భుజం నొప్పి వస్తే, చిన్నదేగా అని కొట్టిపారేస్తుంటారు.అయితే భుజం నొప్పి వస్తే ఈజీగా తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భుజంలో నిరంతర నొప్పి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమంట. దీర్ఘకాలంగా భుజం నొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ,విపరీతమైన భుజం నొప్పి ఊపిరిత్తుల క్యాన్స్రకు సూచిక కావొచ్చని చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ కారణంగా వచ్చే భుజం నొప్పి ఎక్కువగా రాత్రి సమయంలో వస్తుందంట. అందువలన ఇలాంటి వాటిని అస్సలే ఈజీగా తీసుకోకూడదంట. ముఖ్యంగా గంటల తరబడి కూర్చుని జాబ్ చేసేవారు భుజం నొప్పి వస్తే అస్సలే లైట్ తీసుకోకూడదంట. అందువలన చిన్న చిన్న నొప్పులను అస్సలే లైట్ తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.