పెళ్లికి ముందు ఆ విషయాల్లో స్పష్టత అవసరం.. లేదంటే జీవితం నరకమే..!

జీవితంలో ఒక్కసారి వచ్చేది వివాహం. కాబట్టి ముందు వెనుక అన్ని చూసుకుని పెళ్లి చేసుకోవాలి అంటారు పెద్దలు.

Update: 2023-05-02 15:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో ఒక్కసారి వచ్చేది వివాహం. కాబట్టి ముందు వెనుక అన్ని చూసుకుని పెళ్లి చేసుకోవాలి అంటారు పెద్దలు. అంతే కాదు పెళ్లి చేసుకునే వ్యక్తులు కూడా వారి గురించి వారు తెలుసుకుని పెళ్లికి సిద్దపడితే మంచిది. అయితే పెళ్లి చేసుకునే ముందు వధువరులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం..

* పెళ్లి చేసుకునే ముందు జంట తమ అభిప్రాయాలు, అభిరుచులు గురించి మాట్లాడుకోవాలి.

* కెరీర్ లక్ష్యాలు అర్థం చేసుకోవడం ఏ జంటకైనా పునాది లాంటిది.

* పిల్లల విషయంలో కూడా క్లారిటీగా మాట్లాడుకోవాలి. పెళ్లి కాగానే పిల్లలు పుడితే వారిని పెంచేందుకు భాగస్వామి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి.

* పెళ్లైన తర్వాత సొంత ఊరులో ఉందాం అనుకుంటున్నారో, లేక ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారో తెలుసుకోవాలి.

* మీ కొత్త బంధం తెచ్చే కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇద్దరు సిద్ధంగా ఉండాలి.

ఇలా పెళ్లికి ముందు అన్ని విషయాల గురించి భాగస్వాములు చర్చించుకుంటే వారి జీవితం చాలా సజావుగా ఉంటుంది. కేవలం ఇంటి పనుల నిమిత్తమే పెళ్లిళ్లు చేసుకోరు కాబట్టి.. కచ్చితంగా భాగస్వామి అభిప్రాయాలు, ఇష్ట అయిష్టాలను తెలుసు కోవాలి.

Tags:    

Similar News