Sweater: రాత్రి పూట స్వెట్టర్ వేసుకుని అలాగే నిద్రపోతున్నారా.. అయితే, ఈ సమస్యలు తప్పవు!
దీని వలన ప్రజలు, నిద్రపోయేటప్పుడు కూడా స్వెట్టర్లు ధరిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది నిద్రపోయేటప్పుడు కూడా స్వెట్టర్లు ( sweater ) ధరించి పడుకుంటారు. వాస్తవానికి ఇది ఆరోగ్యానికి ( health )మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, ఎక్కడా చూసిన చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం స్వెట్టర్లు, జాకెట్లు వంటి వెచ్చని దుస్తులను ధరిస్తారు. వీటిని ధరించి పడుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
చలికాలం బాగా చల్లగా ఉంటుంది. దీని వలన ప్రజలు, నిద్రపోయేటప్పుడు కూడా స్వెట్టర్లు ధరిస్తున్నారు. అయితే, స్వెట్టర్ ధరించి నిద్రపోతే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీని వలన రక్త ప్రసరణ రక్త ప్రసరణ ఆగిపోయి, ఆ తర్వాత కండరాలు సమస్య వచ్చే అవకాశం ఉంది.
అంతే కాదు, కొందరికి ఉదయం నిద్రలేచిన తర్వాత చేతులు, కాళ్లు తిమ్మిరి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే, శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. వెచ్చని దుస్తులు ధరించి పడుకోవడం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఇది ప్రాణాంతకం కావొచ్చు. స్వెట్టర్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి, ఇలాంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట స్వెట్టర్ వేసుకోకపోవడమే మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.