ఈ ఒక్క ప్రాబ్లం లేకపోతే చాలు.. డైజెస్టివ్ హెల్త్ బాగున్నట్లే!

ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణశక్తి బాగుండాలి.

Update: 2024-11-16 07:59 GMT

దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణశక్తి బాగుండాలి. శరీర ఆరోగ్యాన్ని జీర్ణశక్తి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఉదర సంబంధిత వ్యాధులే కారణమని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఈ రోజుల్లో చాలామంది తీసుకునే ఆహారం పొట్టలో అజీర్ణం, వాతం సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థలో గ్యాస్ అధికంగా చేరడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అదేలా అంటారా. ఆహారంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియకు శక్తిని ఇచ్చి, జీర్ణసమస్యలను దూరం చేస్తుంది.

కడుపు సంబంధిత సమస్యలు మెదడుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రేగులో ఉండే మంచి, చెడు బ్యాక్టీరియాలు ప్రేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇందులో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే..అది మెదడు కణాలపై, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉన్నట్లైతే గ్యాస్ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరంగా మారుతుంది. అలా జరగలేదంటే జీర్ణక్రియలో ఎటువంటి సమస్య లేదని అర్థం. అందువల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్ధాలను తినకపోవడమే మంచిది.

శరీరం ఆరోగ్యంను జీర్ణక్రియ నిర్ణయిస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే మంచి నిద్రను పొందుతారు. శరీరానికి మంచి నిద్ర లభిస్తే, అది శారీరక, మానశిక ఆరోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మలం, మూత్రంలో వచ్చే మార్పులు కూడా శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. రోజులో ఒకటి లేదా రెండుసార్లు ప్రేగు కదలికలను కలిగి ఉంటే, జీర్ణక్రియపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని అర్థం.

గ్యాస్ ఉంటే కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, కడుపు క్యాన్సర్‌కు కారణం అవుతుంది. భోజనం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా ఉండటం, నొప్పి వంటి సమస్యలు క్యాన్సర్‌కు సంకేతాలు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News