మీకు పానీ పూరీ అంటే ఇష్టమా...? అయితే ఇవి తెలుసుకోండి..!
మన దేశంలో పానీ పూరీకి మంచి డిమాండ్ ఉంది.
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలో పానీ పూరీకి మంచి డిమాండ్ ఉంది. అందరూ ఎక్కువగా ఇష్టపడే ఒకే ఒక స్ట్రీట్ ఫుడ్ ఇదే. ఇందులో ఉపయోగించే ఆలుగడ్డ, పచ్చి బఠానీ, ఆనీయన్, చింతపండు, మసాల నీరు, కరకరలాడే పూరీని తింటుంటే ఆ రుచే వేరు. అయితే దీనిని వివిధ పాంత్రాలల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. చాలామంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. దీనివలన అనేక రోగాలు వస్తాయని తినకూడదని అంటుంటారు. ఇవి రోడ్డు పక్కన ఉండటం వలన అశుద్ధ ఆహారం అని, రోగాలు వ్యాపిస్తాయని అందరి భావన.
కానీ దీనిని ఇంట్లో తయారు చేసుకుని లేదా శుభ్రమైన ప్రదేశాలలో తయారు చేస్తే తినోచ్చని నిపుణులు చెబుతున్నారు. పానీ పూరీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. భారతదేశంలో దొరికే ఈ స్ట్రీట్ ఫుడ్ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల రుచులతో దొరుకుతుంది. తీపి, పులుపు, కారం లాంటి విభిన్న రుచులతో లభిస్తోంది. పానీ పూరీ విరిగిపోకుండా అలానే తినడం ఒక కళా అయితే పానీ పూరీ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
పానీపూరీలో ఉపయోగించే పానీలో జీలకర్ర, కొత్తిమిర, చింతపండు, కారం, పచ్చిమిర్చి ఉపయోగించడం వలన ఆ పానీ జీర్ణక్రియను పెంచుతుంది. అందువలన అజీర్తి, మలబద్దకంలాంటి సమస్యలు దూరం అవుతాయి.
పోషకాలు:
ఇది నమ్మడానికి విడ్డూరంగా ఉన్న పానీ పూరీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మోగ్నిషియం, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి దోహదపడుతాయి. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉన్నవారికి పానీపూరీ కొంత మేర విముక్తి కలుగుతుంది.
బరువు నియంత్రణ:
పానీ పూరీ తినడం వలన బరువును నియంత్రించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉండటం వలన ఇది జీర్ణ క్రీయకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పానీ పూరీ రుచి దానిలో ఉపయోగించే పదార్థాలపై ఆధారపడుతుంది. నిమ్మకాయ, అల్లం, జీలకర్ర, మిరియాలు, మన శరీంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
ఎసిడిటీ కంట్రోల్:
పానీ పూరీలో ఉపయోగించే జీలకర్ర ఎసిడిటీని, దాని వలన కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉపయోగించే పుదీన, కొత్తిమేర లాంటి పదార్థాలు బలమైన యాంటీ ఇన్‌ప్లమేటరీ, గుణాలను కలిగి ఉంటాయి.
పానీ పూరీని ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలా...?
ఆవిరి మీద ఉడికించిన పానీ పూరీని తినడం మంచిది. అలాగే స్టఫ్ కోసం మొలకెత్తిన పెసలు, బటనీలు, శెనగలు ఉపయోగించడం మంచిది. పుల్లటి చింతపండు, నిమ్మకాయలకు బదులుగా జీలకర్ర నీటిని ఉపయోగించడం చాలా మంచిది.