మద్యం తాగిన తర్వాత వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..? వామ్మో దీని వెనుక ఇన్ని రీసన్స్ ఉన్నాయా
ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ మార్గాలు కూడా ఎక్సైజ్ శాఖలే మారుతున్నాయి.
దిశ, ఫీచర్స్: ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ మార్గాలు కూడా ఎక్సైజ్ శాఖలే మారుతున్నాయి. కొందరు ఆల్కహాల్ తాగితే వాంతులు చేసుకుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వారి శరీర తత్వాన్ని బట్టి కారణాలు వేరుగా ఉంటాయి. ఆల్కహాల్ తీవ్రతను తట్టుకునే శక్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు ఆల్కహాల్ తక్కువగా తాగినప్పటికి వారికి వాంతులవుతాయి. వారిలో ఆల్కహాల్ తట్టుకునే శక్తి తక్కువగా ఉండోచ్చు లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావొచ్చు. ఆల్కహాల్‌ను సేవించేటప్పుడు మితిమీరి కాకుండా, బాధ్యతాయుతంగా తాగడం అవసరం. అలాగే వాంతులు మాటిమాటికి ఎక్కువగా అవుతూ ఉంటే అది వేరే ఆరోగ్య సమస్యలకు దారి తీసిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించుకోవడం.. ముందు జాగ్రత్త పడటం అవసరం.
అసలు వాంతులు అవ్వడానికి కారణాలు ఏంటంటే..
డీహైడ్రేషన్
బేసిక్‌గా ఆల్కహాల్ బాడీలో మూత్రం ఎక్కువ స్థాయిలో ప్రొడ్యూస్ అయ్యేల చేస్తుంది. దీనివల్ల మూత్రానికి ఎక్కువగా వెళ్లడం వల్ల, శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ గురి అయి కూడా వాంతులు కావచ్చు.
ఆల్కహాల్ విషపూరితంగా మారటం:
ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో సేవించేటప్పుడు అది పాయిజనింగ్‌గా మారుతుంది. ఇది బయటకు వచ్చే టైంలో వాంతులు అవుతాయి. దీనివల్ల ప్రాణానికే ప్రమాదం కావచ్చు. ఎవరైనా ఈ సమస్య ఎదుర్కొంటుంటే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది.
స్పీడ్‌గా ఆల్కహాల్ తాగడం:
తక్కువ సమయంలో ఒకేసారి ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల అది విషపూరితంగా మారి శరీర జీవక్రియ మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా శరీరంలో రక్షణ వ్యవస్థ మీద కూడా ఒత్తిడి పెరిగి అది వాంతులకు కారణమవుతుంది.
ఆల్కహాల్ వేరే డ్రగ్స్‌తో మిక్స్ అయినప్పుడు:
ఒకే రకమైన బ్రాండ్ కాకుండా.. రెండు మూడు రకాల ఆల్కహాల్ తాగినప్పుడు అది వాంతులు కావడానికి దారితీయవచ్చు. అయితే ఆ మిక్సింగ్ అయిన పదార్ధాన్ని బట్టి తీవ్రత ఉంటుంది. ఇలా చేయడం కొన్ని సార్లు ప్రాణానికే ప్రమాదం కావొచ్చు. మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ సేవించాలంటే మీ డాక్టర్‌ను సంప్రదించండి.
జీర్ణాశయ లైనింన్ దెబ్బతినడం:
ఆల్కహాల్ జీర్ణాశయ లైనింన్‌పై ఒత్తిడి కలిగించే సామర్థ్యం ఉంటుంది. దీంతో ఇది వాంతులకు కారణమవుతుంది. ఇది అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
తాగిన వెంటనే ప్రయాణించడం:
ఆల్కహాల్ సేవించిన తర్వాత జర్నీ చేయడం వల్ల కడుపులో తిప్పుతుంది. దీన్ని ‘మాషన్ సిక్నెస్’ అంటారు. ఇలా తిప్పడం వల్ల వాంతులు అవుతాయి.
ఆరోగ్య సమస్యలు:
అసిడిటీ, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా మద్యం తాగితే తర్వాత వాంతులు అవుతాయి. ఇది కొంతమందిలో వారి బరువు, శరీరతత్వం వంటి అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదిచడం ఉత్తమం.